NewsOrbit
న్యూస్ సినిమా

Divyansha kaushik : దివ్యాన్ష కౌశిక్ తెలుగు సినిమాలకోసం ఎదురు చూపులు

Divyansha kaushik : సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా మంది హీరోయిన్స్ వస్తారు. కొందరికి వెంటనే అవకాశాలు దక్కుతాయి. కొంతమందికి రెండు మూడేళ్ళు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొంతమంది ముందు మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి కాస్త దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించి అవకాశాలను అందుకుంటారు. అయితే ఇక్కడ సక్సెస్ ఎప్పుడు ఎవరి కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందో చెప్పలేము. మొదటి సినిమాలో సోలో హీరోయిన్‌గా నటించి హిట్ అందుకుంటే ఆ తర్వాత వరుసగా సినిమా
అవకాశాలు దక్కుతాయి. అదే మొదటి సినిమా గనక ఫ్లాపయితే మళ్ళీ ఆమెని పట్టించుకునే వాళ్ళు ఉండరు. వచ్చిన దారినే వెనక్కి తిరగాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

divyansha-kaushik-is waiting for telugu movies
divyansha kaushik is waiting for telugu movies

అలా ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్. అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ కూడా ఒక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్‌ దివ్యాన్ష కౌశిక్ ఆ తర్వాత మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీలో ఫస్టాఫ్‌ మొత్తం దివ్యాన్ష కౌశిక్ కనిపించి బాగా ఆకట్టుకుంది. కానీ ఈమెకి కాకుండా సమంత చుట్టూ బలమైన సన్నివేశాలు, అసలు కథ తిరగడంతో దివ్యాన్ష పాపులర్ కాలేదు.

Divyansha kaushik : దివ్యాన్ష కౌశిక్‌కి మరో సినిమాలో అవకాశం ఇచ్చే మేకర్స్ ఎవరో, దాంతో తన మొదటి సినిమా సూపర్ హిట్ గా నిలిచినా కూడా దివ్యాన్ష మాత్రం తర్వాత అవకాశాలు కోసం ఎదురు చూస్తూ వస్తోంది. ఇక ఇదే సమయంలో కరోనా కారణంగా టాలీవుడ్‌లో కొత్త సినిమాలు కూడా మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమంలో దివ్యాన్ష కి గ్యాప్ బాగా వచ్చింది. అయితే రీసెంట్‌గా టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి దివ్యాన్ష గురించి మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ కథలను వింటోందట. ఇప్పుడు కమిటయిన ప్రాజెక్ట్ కాకుండా మరో మంచి సినిమాలో అవకాశం వస్తే ఒప్పుకోవాలని ఎదురు చూస్తుందట. తెలుగులో మళ్ళీ ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దివ్యాన్ష కౌశిక్‌కి మరో సినిమాలో అవకాశం ఇచ్చే మేకర్స్ ఎవరో చూడాలి.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu