Gunashekhar : గుణశేఖర్ సినిమా అంటే దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులతో పాటు సినీ వర్గాలకి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అయితే ఆయన మొదటి సినిమా నుంచి ఓ విషయం గమనిస్తే అయితే భారీ హిట్ లేదా భారీ డిజాస్టర్ అవుతుంది. అది కూడా ఆయన తీసేది స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి అంచనాలు ఎంతగా ఉంటాయో అభిమానుల్లో భయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఆయన శాకుంతలం అనే సినిమా చేస్తున్నాడు. పౌరాణిక జోనర్ కాబట్టి ముందు నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి.
అక్కినేని సమంత ఇందులో కావ్య నాయకి శకుంతలగా నటిస్తోంది. అయితే సమంత స్థాయి హీరోని ఇందులో తీసుకోకపోవడం పెద్ద మైనస్ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఈ నటుడు మలయాళంలో పాపులర్ ఏమోగానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం అంతగా తెలీదు. అదే ఓ మైనస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే గుణశేఖర్ సినిమా కాబట్టి కథ మీద, సమంత పాత్ర మీదే జనాలు ఎక్కువగా ఫోకస్ పెట్టేలా సినిమాను రూపొందిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్.
Gunashekhar : బుల్లితెర యాంకర్ వర్షిణిని తీసుకొని అంచనాలు పెంచుతున్నారు.
కాగా ఇటీవల ఈ సినిమాలో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ నటిస్తున్నట్టు ప్రకటించి, తాజాగా బుల్లితెర యాంకర్ వర్షిణిని తీసుకొని అంచనాలు పెంచుతున్నారు. వర్షిణి షూటింగ్ లో ఇప్పటికే జాయిన్ అయ్యింది. సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా, ఇద్దరి మీద దర్శకుడు గుణశేఖర్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక శాకుంతలం సినిమాలో వర్షిణి పాత్ర ఏంటీ అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న శాకుంతల సినిమాను గుణ టీం వర్క్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!