Job Guarantee: ఇంటర్ పూర్తి కాగానే వీలైనంత త్వరగా సంపాదించడం మొదలు పెట్టాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటూ ఉంటారు. దానికి కారణం తర్వాత చదువుల కు అయ్యే ఖర్చులు భరించలేక పోవడం, ఇలాంటి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడున్న కరోనా వైరస్ వలన ప్రజల భద్రత దృష్ట్యా ఆన్లైన్ క్లాసెస్ , ఆన్లైన్ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ కోర్సులు కూడా నేర్పిస్తున్నారు.ఉచిత డిప్లొమా కోర్సు చేయడానికి అవకాశం ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో ఈ కోర్సు లకు చాలా డిమాండ్ ఉంది.ఈ కోర్సు చేసిన తర్వాత గొప్ప వృత్తి ని ఇవ్వగల స్వల్పకాలిక ఉద్యోగాల గురించి వివరాలు తెలుసుకోండి.
హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అత్యంత ప్రాచుర్యం పొందినది. ఈ కోర్సు 12 చదివిన తర్వాత కూడా చేయవచ్చు.ఈ కోర్సు 6 నెలల నుండి 1 సంవత్సరం వ్యవధి లో నేర్చుకోవచ్చు . ఇది కాకుండా 2 సంవత్సరాల అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు కూడా చేయవచ్చు. ఈ కోర్సు చేసిన తర్వాత రిసెప్షనిస్ట్, చెఫ్,రూమ్ సర్వీస్ స్టాఫ్, మేనేజర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
డిజిటల్ మార్కెటింగ్ డిప్లొమాఈ రోజుల్లో ఏదైనా కోర్సు,కానీ ఏదైనా వృత్తి డిమాండ్ కానీ ఉంది ఉంటే అది డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అని కచ్చితం గా చెప్పవచ్చు. 12 వ పాస్ లేదా గ్రాడ్యుయేట్ అభ్యర్థులు కూడా ఈ కోర్సు లో చేరవచ్చు.స్వల్పకాలిక కోర్సుల్లో ఈ కోర్సు 3 నుంచి 12 నెలల వరకు కొనసాగుతుంది. ఈ కోర్సు ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్ ఎందులో అయినా చేయవచ్చు. ఈ కోర్సు పూర్తిఅయిన తరువాత మేనేజర్, ఎగ్జిక్యూటివ్, స్పెషలిస్ట్ మార్కెటర్గా ఉద్యోగాలు లభిస్తాయి .