ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ భారతదేశంలో నోకియా ఎయిర్ కండీషనర్ల అమ్మకాలను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. పూర్తి స్వదేశంలో తయారైన ఈ ఏసీలకు ఇన్వర్టర్ టెక్నాలజీ మరియు మోషన్ సెన్సార్లు వంటి లక్షణాలను ఈ ఏసీలలో పొందుపరచారు. ఈ మోడల్ ఏసికి వై-ఫై-కనెక్ట్ చేసిన స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్ మరియు పలు ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏసీకి సంబందించిన ఫీచర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నోకియా ఎయిర్ కండీషనర్స్ లక్షణాల విషయానికొస్తే, నోకియా ఎయిర్ కండీషనర్ శ్రేణిలో ఫోర్ ఇన్ వన్ సర్దుబాటు చేయగల ఇన్వర్టర్ మోడ్‌తో పాటు సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంది. ఎయిర్ కండీషనర్లు డ్యూయల్ రోటరీ కంప్రెషర్లతో పాటు బ్రష్ లేని డిసి మోటార్లను ఇందులో ఇంబిల్ట్ చేశారు. సిక్స్ ఇన్ వన్ ఎయిర్ ఫిల్టర్లు మరియు నెగటివ్ అయానైజర్ కూడా ఉంటుంది. ఇప్పటికే టీవీలతో, లాప్ టాప్ లతో ముందుకు వచ్చి, ఇప్పడు నోకియా ఎయిర్ కండీషనర్లలో తక్కువ ధరకే స్మార్ట్ ఫీచర్లు ఉంటాయని సంస్థ తెలిపింది. కొత్త యంత్రాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా రిమోట్‌గా కంట్రోల్ చేసే సదుపాయం ఉంది.
భారతదేశ మార్కెట్లో ఈ నోకియా ఎయిర్ కండీషనర్ల ధర ఫ్లిప్ కార్ట్ ద్వారా నోకియా ఎయిర్ కండిషనర్ల అమ్మకాలు డిసెంబర్ 29 నుండి ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ. 30,999. ఆన్లైన్ మార్కెట్ మార్కెట్లోకి తీసుకువస్తున్న వేరియంట్ల గురించి ఇంకా నిర్దిష్ట వివరాలను అందించలేదు. రానున్న వేసవిలో చాల స్మార్ట్ ఫిచర్స్ కలిగిన ఈ ఏసిని కొనుగోలు చేసి వేసవిని ఎంజాయ్ చెయండి. మార్కేట్లో ఉన్న రకరకాల కంపెనీలను ఇది తట్టుకొని మార్కెట్లో నిలువగలదో వేచి చూడాలి