NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TRS: పడిపోతున్న టీఆర్ఎస్ గ్రాఫ్! ప్రశాంత్ కిషోర్ వైపు కెసిఆర్ చూపు?

TRS: టీఆర్ఎస్ కూడా రాజకీయ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోబోతున్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది.వరుసగా రెండుసార్లు అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి మునుపటి అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు.నిజానికి ఏ పార్టీ అయినా పదేళ్లపాటు అధికారంలో ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందన్నది వాస్తవమే.టీఆర్ఎస్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు.వరస పెట్టి దుబ్బాక మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచినప్పటికీ,ఇందుకు ఆ పార్టీ సర్వశక్తులూ ధారపోయాల్సి వచ్చింది.ఉప ఎన్నికలంటే ఆ వ్యవహారం వేరు.కానీ సాధారణ ఎన్నికలంటే సీన్ వేరుగా ఉంటుంది.

Falling TRS graph!
Falling TRS graph!

కాంగ్రెస్ ,బీజేపీతోపాటు షర్మిల పార్టీ కూడా పోటీయే!

తాజాగా తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి.కాంగ్రెస్ కి తెలంగాణలో స్వతహాగానే బలం ఉంది.బిజెపి నిలదొక్కుకోవాలని చూస్తోంది. ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్‌ను బలంగా ఢీ కొట్టే శక్తిసామర్థ్యాలను అందుకుంటోన్నాయి. ఇదే క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైెఎస్ షర్మిల సైతం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోండటం రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తోంది.షర్మిల పార్టీ వల్ల తెలంగాణలో అత్యంత బలంగా ఉండే ఒక సామాజికవర్గం తప్పనిసరిగా ఆమె వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని చెప్పాలి. వీటన్నింటినీ అధిగమించి- 2023లో అధికారంలోకి రావడానికి గులాబీదళం శక్తికి మంచి చెమటోడ్చక తప్పకపోవచ్చు.

పీకే అయితే ఓకే !

దీన్ని ముందే గ్రహించినట్టుంది టీఆర్ఎస్ అధిష్ఠానం. అందుకే- దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలను పాటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ సహాయక సహకారాలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం. ఏపీలో బలమైన తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టి- ఏకంగా 151 స్థానాలను గెలచుకుంది వైఎస్సార్సీపీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీని వెనుక ప్రశాంత్ కిషోర్..ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ ఉందనేది బహిరంగ రహస్యమే.ఇక ప్రశాంత్ కిషోర్ కూడా బిజెపియేతర పార్టీలకు సాయం చేయటానికి ముందుంటున్నారు.కాబట్టి టీఆర్ఎస్ కి కూడా ఆయన స్నేహ హస్తం అందించే అవకాశాలు లేకపోలేదు.ఇంతకు ముందే ఒకసారి పీకేతో కేటీఆర్ భేటీ అయినట్లు కూడా టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రాగలదు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N