Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ఎంత ఉన్నా గాని తోటి హీరోలతో మెగా హీరోలతో చాలా కలివిడిగా ఉంటారు. ముఖ్యంగా సినిమాల విషయంలో మెగా కాంపౌండ్ హీరోలకు చెందిన కుర్ర హీరోల కెరీర్ లో కొంత చొరవ తీసుకుని మరి చాలా పెద్ద రకంగా చరణ్ వ్యవహరిస్తూ ఉంటారని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. మంచి స్టోరీ తనదాకా వస్తే .. అది తనకు సూటి కాకపోతే వెంటనే సదరు డైరెక్టర్ కి మరో మెగా హీరోని సిఫార్సు చేసే రీతిలో చరణ్ వ్యవహరిస్తారని అంటారు.
ఈ రీతిగానే శేఖర్ కమ్ముల మొదట తన దగ్గరికి తీసుకు వచ్చిన “ఫిదా” స్టోరీని రిజెక్ట్ చేసి దాన్ని .. వరుణ్ తేజ్ కి సిఫార్సు చరణ్ చేశాడని చెబుతారు. ఆ రీతిగా వరుణ్ తేజ్ ఖాతాలో “ఫిదా” బ్లాక్ బస్టర్ అవ్వటానికి మొట్టమొదట ప్రముఖ పాత్ర పోషించింది రామ్ చరణ్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఇదే రేటులో మరో డైరెక్టర్ తన దగ్గరికి కథ తీసుకువస్తే అది బాగా నచ్చడంతో పాటు తనకి సూటు కాకపోవటంతో వెంటనే వరుణ్ తేజ్ ని సిఫార్సు చేయడం జరిగిందట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు వెంకీ కుడుముల.
Read More: Ram charan : రామ్ చరణ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ వల్లే స్పీడ్ తగ్గిందా..?
“చలో” సినిమా తో మొట్ట మొదటి హిట్ అందుకొని తరువాత “భీష్మ” సినిమాతో రెండో హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఇటీవల రామ్ చరణ్ కి పోలీస్ స్టోరీ వినిపించటం జరిగిందట. మొదటిలో బాగానే ఉన్న తర్వాత నచ్చకపోవడంతో వెంటనే ఆ కథని వరుణ్ తేజ్ కి అయితే బాగుంటుంది అని చెప్పటంతో …. వెంకీ కుడుముల ఇటీవల వెళ్లి వరుణ్ తేజ్ కి స్టోరీ వినిపించడంతో అంతా ఓకే అయినట్లు .. మొదటి సిట్టింగ్ లోనే వరుణ్ తేజ్ ఓకే చేసినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.