Buchibabu : ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా మారిన దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి అందరిని ఆశ్చర్యపరచింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో బుచ్చిబాబుకు బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. కానీ ఆయన నెక్స్ట్ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకే చేయాలని కమిట్ అయి ఉన్నాడు. కాగా ‘ఉప్పెన’ మూవీ వచ్చి ఇప్పటికే నాలుగు నెలలు దాటింది. అయినా ఇంకా బుచ్చిబాబు నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. సుకుమార్ అసోసియేట్ గా పని చేస్తున్నప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ తో మంచి బాండింగ్ ఉంది.

ఈ బాండింగ్ తో ఆయనకు ఓ కథ కూడా బుచ్చిబాబు చెప్పి ఓకే చేసుకున్నాడట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ ఉంటుందని చెప్పుకుంటున్నారు. తారక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. ఇంకా ఆయన నుంచి ఓకే అని గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదట. వచ్చినప్పటికీ ఇప్పట్లో ఈ కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు లేవంటున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అవడానికి చాలా సమయం పడుతుంది. అవి అయ్యాక బుచ్చిబాబు దగ్గరకు వస్తాడు తారక్.
Buchibabu : నెక్స్ట్ సినిమా ఏంటో .. ఎప్పుడో అని మాట్లాడుకుంటున్నారు.
దానికి చాలా సమయమే పడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రీ మేకర్స్ కూడా బుచ్చిబాబుతో సినిమా ఉందని చెప్పారు. కానీ, అది ఎప్పుడు.. ఎవరితో అని మాత్రం అఫీషియల్ గా కన్‌ఫర్మ్ చేయలేదు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు, బన్నీ ని కలిసి కూడా కథ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. మరీ బన్నీ ఈ కథ ఓకే చేశాడా లేదా అన్నది క్లారిటీ లేదు. అయితే అల్లు అర్జున్ కూడా వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో మరో మూడేళ్ళు ఖాళీ లేడు. బన్నీనే కాదు పెద్ద హీరోలెవరూ బుచ్చిబాబు కథ నచ్చినా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. మరి ఆయన నెక్స్ట్ సినిమా ఏంటో ..ఎప్పుడో అని మాట్లాడుకుంటున్నారు.