ఈ రోజు ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టాల్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాక వివిధ ప్రాంతాల్లో ప్రభాస్ అభిమానులు బాణాసంచా కాలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. థియేటర్ వద్ద పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టి సంబరాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఓ సినిమా థియేటర్ అగ్నిప్రమాదానికి గురైంది. థియేటర్ లో మంటలు ఎగిసిపడ్డాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని వెంకట్రామ థియేటర్ కొద్ది కాలంగా మూసివేశారు. అయితే ప్రభాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అభిమానుల ఆధ్వర్యంలో బిర్లా సినిమాను ప్రదర్శించారు. అయితే సినిమా ప్రదర్శన జరుగుతున్న సందర్భంలో అభిమానులు అత్యుత్సాహంతో థియేటర్ లో సీట్ల మీద బాణా సంచా కాల్చారు. దీంతో సీట్లు కాలిపోయి థియేటర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. థియేటర్ మొత్తం పొగ వ్యాపించడంతో భయాందోళనకు గురైన అభిమానులు బయటకు పరుగులుతీశారు. థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. థియేటర్ లో బాణా సంచా కాల్చిన వీడియోను విజయవాడ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. అభిమానుల రచ్చపై నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Breaking: విజయవాడ బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం .. ఇద్దరు సజీవ దహనం
Rebels on rampage mode 😎🔥🔥🔥💥#HappyBirthdayPrabhas #Billa4KCelebrations pic.twitter.com/A9IvJ4uKKx
— 𝖵𝗂𝗃𝖺𝗒𝖺𝗐𝖺𝖽𝖺 𝖯𝗋𝖺𝖻𝗁𝖺𝗌 𝖥𝖢™ (@VJYPrabhasFC) October 23, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!