Shruti Haasan: లవ్ లో పడడం, డేటింగ్ చేయడం, ఆ తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం, సెట్ అవ్వకపోతే విడిపోవడం ఇవన్నీ సినీ తారలకు కొత్తేమి కాదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే పెళ్లి తర్వాత కొన్నాళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలాగే పెళ్ళి వరకు వెళ్లకుండా డేటింగ్ తోనే బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్ కూడా చేరింది.
గత కొన్నేళ్ల నుంచి శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతను హజారికాతో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ముంబైలో ఒకే ఫ్లాట్ లో ఉంటూ సహజీవనం కూడా స్టార్ట్ చేశారు. శాంతను తో ఉన్న ప్రతి హ్యాపీ మూమెంట్ ని శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పబ్లిక్ గా రొమాన్స్ చేసుకుంటూ ఈ జంట ఎన్నో సార్లు రెచ్చిపోయారు. శృతి హాసన్ ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటే శాంతను కూడా ఉండేవారు. వీరి రిలేషన్ చూసి రేపో మాపో పెళ్లి కూడా చేసుకుంటారని అభిమానులు భావించారు.
కానీ శృతి హాసన్ మళ్లీ లవ్ లో ఫెయిలైంది. దాదాపు మూడేళ్ల నుంచి రిలేషన్లో ఉన్న శాంతను హజారికా, శృతి హాసన్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఇటువంటి ప్రచారమే జరిగినా.. శృతి హాసన్ వాటిని ఖండించింది. అయితే ఈసారి మాత్రం బాయ్‌ఫ్రెండ్ తో బ్రేకప్ ను శృతి హాసన్ పరోక్షంగా కన్ఫార్మ్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో శాంతను హజారికాను శృతి హాసన్ అన్ ఫాలో చేసింది. అలాగే శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను శృతి హాసన్ డిలీట్ చేసి పడేసింది. అలాగే శాంతను కూడా ఇన్స్టాగ్రామ్ లో శృతి హాసన్ లో అన్ ఫాలో అయ్యాడు.
పైగా గత కొద్ది రోజుల నుంచి శృతి హాసన్, శాంతను జంటగా కనిపించిన సందర్భాలు కూడా లేవు. ఇటీవల హీరామండీ ప్రీమియర్ షోకి కూడా ఆమె ఒంటరిగా వెళ్లింది. దీంతో శృతి హాసన్, శాంతను విడిపోయారంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. కాగా, శృతి హాసన్ కు ఇదేమి ఫస్ట్ బ్రేకప్ కాదు. గతంలో లండన్ కుర్రాడు మైఖేల్ కర్సెల్‌తో శృతి హాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. మైఖేల్ కోసం శృతి తన కెరీర్ నే వదిలేసింది. సినిమాలు చేయడం మానేసి లండన్ లో మైఖేల్ తో కలిసి మకాం వేసింది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మైఖేల్ ను శృతి హాసన్ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దాంతో మైఖేల్, శృతి పెళ్లి ఫిక్స్ అని అందరూ భావించారు. కానీ ఏమైందో ఏమో గానీ పెళ్లి వరకు వెళ్లకుండానే మైఖేల్ తో శృతి హాసన్ విడిపోయింది. ఆ సమయంలో ఆమె ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లింది. బ్రేకప్ నుంచి బయటపడ్డాక ఇండియా వచ్చిన శృతి హాసన్.. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.