ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలోని పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక .. ఎక్కడెక్కడ అంటే..?

Share

ఏపిలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఉత్తర – దక్షిణ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఇది విస్తరించి ఉందని చెప్పింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వలు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని చెప్పారు. బుధవారం నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయని తెలిపారు.

 

మరో వైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత అయిదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం వరకూ భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో 12- 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.


Share

Related posts

ఏంటి.. ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు.. గట్టిగానే అడిగేసిన రోజా?

Varun G

‘ఆన్‌లైన్‌‌లో ఉన్నాయి చూసుకోండి’

somaraju sharma

Shraddha kapoor amazing pics

Gallery Desk