NewsOrbit
న్యూస్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు ఎలా అప్లై చేసుకోవాలంటే….

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10 +2) ఎగ్జామినేషన్ -2018 నోటిపికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సి) విడుదల చేసింది. దీని ద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

నేటి నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకూ ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తుల స్వీకరణ ప్రకియ నిర్వహిస్తారు.

అభ్యర్థుల ధరఖాస్తు ఫీజుగా వంద రూపాయలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

మూడు దశల పరీక్షల (టైర్ -1, టైర్ -2, టైర్ -3) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.

కంబైన్డ్ ‌హయ్యర్ సెకండరీ లెవల్ (10+2)  ఎగ్జామినేషన్ -2018 పోస్టులు

లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 01.08.2019నాటికి 18-27సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1992 -01.08.2001 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: టైర్ -1, టైర్ -2, టైర్-3 పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

టైర్ -1 పరీక్ష (ఆబ్జెక్టివ్) విధానం

మొత్తం 200మార్కులకు టైర్ -1 ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుండి 100పరీక్షలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుండి 15 ప్రశ్నలు- 50 మార్కులు, జనరల్ ఇంటిలిజెన్స్ నుండి 25 పరీక్షలు -50 మార్కులు, క్యాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు – 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుండి 25 ప్రశ్నలు – 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా అబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షా సమయం 60 నిమిషాలు.

టైర్ -2 (డిస్క్రిప్షిన్) విధానం..

సిహెచ్ఎస్‌ఎల్ టైర్ -2 రాతపరీక్ష డిస్క్రప్షిన్ (పెన్ను పేపర్) విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. వీటిలో వ్యాసరూప ప్రశ్నలకు 200-250 పదాలు; లెవల్ రైటింగ్ / అప్లికేషన్ సంబంధిత ప్రశ్నలకు 150 -200 పదాలకు మించకుండా సమాధానాలు రాయాలి. పరీక్షశ సమయం 60నిమిషాలు.

టైర్ -3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) పరీక్ష విధానం..

టైర్ -2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను టైర్ -3 పరీక్షలకు ఎంపిక చేస్తారు. టైర్ -3 పరీక్షలో స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. టైర్ -3 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు.

*డేటా ఎంట్రీ ఆపరేటర్లకు..డేటా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టులకు గంటకు 8000కి డిప్రెషన్స్ కంప్యూటర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000 -2200కి డిప్రెషన్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌లో టైప్ చేయమంటారు.

*లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్న వారు నిమిషానికి 35 పదాలు, హిందిని ఎంచుకున్న వారు నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి.

జీతభత్యాలు..

పోస్టులుపేబ్యాండ్/ గ్రేడ్‌పే
లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ)పే బ్యాండ్-1 (రూ.5200-20,200),
గ్రేడ్ పే: రూ.1900.
పోస్టల్ అసిస్టెంట్ (పీఏ)/ సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)పేబ్యాండ్-1 (రూ.5200-20,200),
గ్రేడ్‌ పే రూ.2400.
డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)పేబ్యాండ్-1 (రూ.5200-20200),
గ్రేడ్‌ పే రూ.2400.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం05.03.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది05.04.2019.
ఫీజు చెల్లిండానికి చివరితేదీ (ఆన్‌లైన్)07.04.2019.
చలానా జనరేషన్‌కు చివరితేదీ07.04.2019.
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది (ఆఫ్‌లైన్)09.04.2019.
టైర్-1(ఆన్‌లైన్) పరీక్ష తేద01.07.2019 – 26.07.2019.
టైర్-2(డిస్క్రిప్టివ్ పేపర్) పరీక్ష తేదీ29.09.2019.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Leave a Comment