Hyper Aadhi : బుల్లితెరపై జబర్దస్త్ వచ్చిన తర్వాత ఆ కామెడీ షో ని ఆదర్శంగా తీసుకుని ఎన్నో చానల్స్ లో అలాంటి షోలు చేయడం మొదలుపెట్టారు కానీ ఏదీ… దాని దరిదాపులకు కూడా రాలేకపోయాయి. ఇక ఈ షోలో హైపర్ ఆది ఇలాంటి వాళ్ళు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిస్తూ ఉంటారు. ప్రతివారం రికార్డుస్థాయిలో వ్యూస్ సాధిస్తూ హైపర్ ఆది ముందు దూసుకుపోతుంటాడు.
జబర్దస్త్ స్కిట్ లు అనే కాకుండా ఏ షో కి వచ్చినా కూడా తనదైన శైలిలో పంచ్ లు, డైలాగ్ లతో నవ్విస్తూనే ఉంటాడు ఆది. ఇటీవల అతను ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలో కూడా మెరిసిన విషయం తెలిసిందే. హైపర్ ఆది ఇదివరకు చాలా సినిమాల్లో కనిపించాడు కానీ ఈ సినిమాలో మాత్రం అతని పాత్రకి నిడివి, ప్రాముఖ్యత ఎక్కువ.
ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అది ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. ఈ మధ్యకాలంలో అతని పెళ్లి పై అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో ప్రదీప్ గురించి ఎమోషనల్ గా మాట్లాడిన ఆది అదే సమయంలో యాంకర్ శ్యామల…. ఆది తో మీరెప్పుడైనా ప్రేమలోపడ్డారా అని ప్రశ్నించినపుడు…. “ప్రేమ వరకు ఎక్కడ వెళ్ళాను అండి…. డైరెక్ట్ గా…” అంటూ నవ్వేసి నాలుక కరుచుకుని వెళ్లిపోయాడు.
దీంతో ప్రేమలో పడకుండా ఆది నేరుగా పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది అని జనాలు అనుకుంటున్నారు .సోషల్ మీడియాలో కూడా త్వరలోనే ఆది పెళ్లి అనే వార్త వైరల్ చేస్తున్నారు. ప్రేమలో పడకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమలో పడాలని హైపర్ ఆది భావిస్తున్నట్లు అతని అభిమానులు అంటున్నారు.