ఇకపై ఆ జీవిని చంపితే జైలుకే.. ఎందుకో తెలుసా?

మ‌న దేశానికి ఆవుల‌కు విడ‌దీయ‌రాని బంధం ఉంది. అందుకే మ‌నుషుల‌కు లేని ర‌క్ష‌ణ ఆవుల‌కు క‌ల్పిస్తారు. అయితే ఆవుల‌కు క‌ల్పించే ర‌క్ష‌ణ‌లో మ‌రో అడుగు ముందుకు ప‌డింది. గోవధ నివారణ, సంరక్షణ చట్టం (2020) అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ అమలుతో కర్ణాటకలో ఇకపై ఆవుల‌కు చంపొద్దు. అలా చేస్తే.. జైలు కూడు తిన‌క‌ త‌ప్ప‌దు. క‌ర్ణాట‌క‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేర‌కు నిర్ణయం తీసుకుంది.

క‌ర్ణాట‌క గవర్నర్ వజుభాయ్ వాలా పశువుల సంరక్షణ బిల్లు -2020ను పోయిన యేడాది డిసెంబర్ 9న అసెంబ్లీలో ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం 13 ఏండ్ల‌ లోపు ఉన్న‌ ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెలను చంపొద్దు. అలా చేస్తే.. తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 13 ఏండ్లు దాటిన వాటిని పరిశోధన కోసం లేదా అనారోగ్యం పాలైనట్లు పశువైద్యులు నిర్ధారిస్తే చంపేందుకు అనుమతి ఇస్తారు. అలాగే వాటిని చంపేందుకు ఇత‌ర రాష్ట్రాల‌కు గానీ, దేశాల‌కు గానీ పంప‌డం కూడా నేరంగానే ప‌రిగ‌ణిస్తారు.

ఈ విష‌యాల‌ను ఉల్లంఘించి గోవుల‌ను చంపితే.. మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అట్లాగే రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా కూడా వేస్తారు. ఇప్పటివరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఈ చ‌ట్టం ఉండేది. ఇక నుంచి కర్ణాటకలో కూడా అమల‌వుతుంది. దీంతో పశువుల‌ను చంపేందుకు సంత‌ల్లో క్రయవిక్రయాలను అనుమతించరు.ఇంకో విష‌యం పశువులను చంపేందుకు అమ్మ‌డం లేదని లిఖితపూర్వక డిక్లరేషన్‌ లేకుండా పశువుల సంతకు ఎవ‌రూ పశువులను తీసుకురావొద్దు.