లంచ్ విరామానికి భారత్ 389/5

సిడ్నీలో ఆస్ట్రేలియాతో చరుగుతున్న చివరి నాలుగో టెస్ట్ రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2-1 ఆధిక్యతలో ఉన్న భారత్ ఈ టెస్టులో గెలిచి ఆసీస్ గడ్టపై తొలి సిరీస్ విజయాన్ని అందుకోవడానికి అద్భుత అవకాశాన్ని సృష్టించుకుంది.

పుజారా 181 పరుగులతోనూ, రిషభ్ పంత్ 27 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి సెషన్ లో హనుమ విహారి వికెట్ కోల్పోయి 86 పరుగులు చేసింది. హనుమ విహారి 96 బంతుల్లో 42 పరుగులు చేశాడు.