NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: ఇండియా ని భారత్ గా మార్చడం వెనక ఇంత పెద్ద ప్లానింగ్ ఉందా .. వామ్మో మోడీ మామూలోడు కాదు !

Advertisements
Share

PM Modi: ప్రపంచ స్థాయిలో మన దేశం గురించి ఇప్పటి వరకూ ఇండియాగా సంభోదిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అధికారిక సమాచారం పంచుకోవాల్సిన సమయంలో ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’, ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే సంబోధించే వారు. ఇది మనందరికీ తెలుసు. ఇది సంప్రదాయంగా వస్తొంది కూడా. అయితే ఇటీవల కాలంలో అన్నింటికీ భారతీయత జోడిస్తూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్.. ఇండియా పేరును భారత్ గా మార్పు చేయాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ మేరకు సంకేతాలు ఇచ్చిన మోడీ సర్కార్ .. ఈ నెల 18 నుండి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తొంది.

Advertisements

 

ఢిల్లీ వేదికగా ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు జీ – 20 శిఖరాగ్ర సమావేశాలు జరగనుండగా, ఈ నెల 9వ తేదీన విదేశీ అతిధులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విందు ఏర్పాటు చేసారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విందు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొన్నారు. ఇలా ఇండియా పేరును మార్చడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు ప్రధాని మోడీ సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అధికారిక కార్యక్రమాల్లో ఇండియా పేరు భారత్ గా మార్చడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు అంటున్నాయి.

Advertisements

 

దీనిపై  కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. “ఇప్పుడు రాజ్యాంగంలోని 1వ అధికరణ ‘భారత్, దట్ ఈజ్ ఇండియా’, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కూడా దాడికి గురవుతున్నాయి” అని పోస్టు చేశారు జైరాం రమేష్. ఈ పోస్టుకు స్పందించిన ఆర్జేడీ ఎంపీ మానోజ్ ఝా .. తాము తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టి కొన్ని వారాలైందని అన్నారు. అప్పటి నుండి బీజేపీ రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని ఆహ్వానాలు పంపడం ప్రారంభించిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఇండియా అంటే భారత్ అని ఉంటుందని.. వారు (బీజేపీ) తమ నుండి ఇండియాను, భారత్ ను వేరు చేయలేరని అన్నారు.

 

ఆంగ్లంలో ఇండియా అని, హిందీలో భారత్ అని పిలవడం ఎప్పటి నుంచో కొనసాగుతుండగా, ఆగమేఘాల మీద ఇండియాను భారత్ గా పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. విపక్షాల కూమిటికి భయపడే దేశం పేరును మార్చేందుకు బీజేపీ యత్నిస్తొందని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. తమ కూటమి పేరు ను బారత్ గా మార్చుకుంటే .. దేశం పేరును మళ్లీ మారుస్తారా అంటూ ప్రశ్నించారు.  అయితే కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత్ అని రాయడంలో, చెప్పడంలో ఇబ్బంది ఏమిటని బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కారణం లేకుండా అపర్ధాలు సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తొందని అన్నారు.

మన దేశం భారత్ అని, అందులో ఎలాంటి సందేహం లేదని, కాంగ్రెస్ ప్రతిదానికీ సమస్యేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అయితే ఈ పేరు మార్పు అంశంపై దేశ వ్యాప్తంగా భిన్న వాదనలు వినబడుతున్నాయి. ఇండియా కూటమి పక్షాలు దీనిపై విమర్శలు చేస్తుండగా, మరి కొన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కొద్ది వారాల క్రితం 26 విపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్’ (INDIA) ఇండియా గా పేరు పెట్టుకున్నాయి. దీనిపై ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ తిరస్కరణ సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ తరుణంలో మోడీ సర్కార్ .. ఆఘమేఖాల మీద ఇండియాకు పేరు మార్చడంపై.. వామ్మో మోడీ మామూలోడు కాదు ! ఇండియా ని భారత్ గా మార్చడం వెనక పెద్ద ప్లానింగ్ యే ఉందంటూ నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.

YSRCP Visakha: వైసీపీలో తోపులు అందరూ వైవీ సుబ్బారెడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ? మ్యాటర్ ఇదే !


Share
Advertisements

Related posts

KTR: క‌రోనా టైంలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన కేటీఆర్‌

sridhar

Chiranjeevi : చిరంజీవి ఆచార్య.. వెంకటేష్ నారప్ప మధ్య భారీ పోటీ.. నెగ్గేదెవరు ..?

GRK

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కోసం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్న ఆర్ట్ డైరెక్టర్..!

GRK