Kangana ranauth : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటించిన క్రేజీ బయోపిక్ తలైవి. తమిళ నాడు ముఖ్యమంత్రి అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఇందులో కంగన టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. పాన్ ఇండియన్ స్థాయిలో తమిళం, హిందీ, తెలుగులో విడుదల చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లో లాక్ డౌన్ విధించి థియేటర్స్ మూతపడటంతో రిలీజ్ ఆగిపోయింది.
రిలీజ్ కి ముందు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ సాంగ్ సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి. అమ్మ జీవితంలోని సినీ, రాజకీయలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెరమీద చూపించబోతున్నారు. ఇప్పటికే వివాదాలు చుట్టుకున్న ఈ సినిమా రిలీజయ్యాక మరెన్ని వివాదాలు చుట్టుకుంటాయో కూడా చెప్పలేని పరిస్థితి. ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత పెరిగిపోతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Kangana ranauth : కంగన రనౌత్ తలైవి జులై చివరి వారంలో రిలీజ్ ..?
తమిళనాడులో ఇటీవల ఎన్నికల సమయంలో ఈ సినిమా రిలీజ్ చేయడం కూడా అంత మంచిది కాదని కూడా పోస్ట్ పోన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారట. థియేటర్స్ ఓపెన్ అయితే జనాలు థియేటర్స్ కి వస్తారా లేదా అనేది అటుంచితే ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జులై చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. అప్పటివరకు థియేటర్స్ ఓపెన్ అవుతాయనే నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే ఓటీటీకే రెడీ అవుతారని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!