Kalyan ram : కళ్యాణ్ రామ్ Kalyan ram సినిమా కెరీర్ ముందు నుంచి నత్త నడక సాగుతోంది. ఒక్క సాలీడ్ హిట్ పడితే వరసగా రెండు మూడు సినిమాలు ఫ్లాపవతున్నాయి. మాస్ హీరోగా మంచి సినిమాలు చేస్తున్నా కూడా కళ్యాణ్ రామ్ కి భారీ హిట్స్ దక్కడం లేదు. గత ఏడాది సంక్రాంతికి ఎంతమంచివాడవురా అన్న సినిమాతో వచ్చాడు కళ్యాణ్ రామ్. మంచి ఫ్యామిలీ కథ అయినా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. కాని ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
ఆ తర్వాత నుంచి మళ్ళీ కళ్యాణ్ రామ్ నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నెగిటివ్ రోల్లో కనిపిస్తాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి రావణ్ అన్న టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట.
Kalyan ram : కళ్యాణ్ రామ్ స్టాటజీ ఏంటన్నది చూడాలి.
ఒక హీరోయిన్ గా కేథరీన్, మరొక హీరోయిన్ గా సంయుక్తామీనన్ నటించబోతున్నట్టు సమాచారం. కాగా కళ్యాణ్ రామ్ నటించే మరో మూడు ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయట. కాని సైలెంట్ గా పని జరుగుతోందని సమాచారం. అయితే ఇలా సైలెంట్ గా సినిమా కంప్లీట్ చేసేసి రిలీజ్ ముందు అనౌన్స్ చేస్తే బజ్ ఎలా క్రియేట్ అవుతుందన్నది అందరిలో కలుగుతున్న సందేహాలు. మరి కళ్యాణ్ రామ్ స్టాటజీ ఏంటన్నది చూడాలి. కాగా సోదరుడు ఎన్.టి.ఆర్ తో ఒక పాన్ ఇండియన్ సినిమాని నిర్మిస్తున్నాడు. త్రివిక్రం దర్శకత్వం వహించబోతుండగా హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ భాగస్వామ్యం కాబోతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!