టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్నాడు నాని. తన సినిమాలు మినిమం గ్యారంటీ అన్న భరోసాతో నిర్మాతలు నాని తో సినిమాలు తీసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటారు. అందుకే నాని హిట్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం నిన్ను కోరి, మజిలీ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు.
‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషనులో వస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా మీద చాలా అంచనాలే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలో నాని ని ఇదివరకెపుడు చూడని ఒక డిఫ్రెంట్ రోల్ లో చూపించబోతున్నాడట. ఆ రోల్ ప్రేక్షకులను బాగా నచ్చుతుందని నాని ఆ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని అంటున్నారు.
నాని ‘టక్ జగదీష్’ లో బైపోలార్ డిజార్డర్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడట. ఈ డిజార్డర్ ఉన్నవారు మానసిక అసమతౌల్యతలు ఎక్కువగా ఉంటాయని… వీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎగ్జయిట్మెంట్కి లోనవడం, బాధగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అవడం జరుగుతుందట. ఇప్పుడు ఈ పాత్రలోనే నాని కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షైన్ స్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.