ప్రపంచ సినిమా రంగంలోనే జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలకి మంచి క్రేజ్. ఇప్పటికీ చాలామంది హీరోలు జేమ్స్ బాండ్ సిరీస్.. మూవీస్ చేయడం జరిగింది. ప్రస్తుతం డేనియల్ క్రెగ్…జేమ్స్ బాండ్ వర్షన్ లలో..బాండ్ పాత్ర చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు అమెరికా టీవీ సిరీస్ మేకర్ ఒకరు… జేమ్స్ బాండ్ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సూట్ అవుతాడని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టీవీ సిరీస్ మేకర్ చియో హోడారి కోకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో యాంకర్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న హీరోలలో.. జేమ్స్ బాండ్ పాత్రలో సరిగ్గా సూట్ అయ్యే వారి పేర్లు చెప్పాలని ప్రశ్న వేయడం జరిగింది.
దానికి అమెరికా టీవీ సీరిస్ మేకర్..చరణ్ సరిగ్గా సూట్ అవుతాడని స్పష్టం చేశారు. రామ్ చరణ్ తో పాటు ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, మాథ్యూ గూడే, డామ్సన్ ఇద్రిస్ పేర్లను కూడా తెలియజేశారు. రామ్ చరణ్ “RRR” లో నటించిన నటనబట్టి.. అతనికి జేమ్స్ బాండ్ పాత్ర సరిగ్గా సూట్ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” కొద్ది నెలల క్రితం నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సినిమా ఇండస్ట్రీ వాళ్లని ఆకట్టుకుంటుంది.
ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది దర్శకులు నటీనటులు “RRR” సినిమా చూసి డైరెక్టర్ రాజమౌళి తో పాటు ఇద్దరు హీరోలు చరణ్, ఎన్టీఆర్ నటనపై తమదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ తరహాలోనే అమెరికా టీవీ సీరస్ మేకర్ “RRR” లో చరణ్ నటన చూసి.. తాజాగా జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కి సూట్ అయ్యే రీతిలో.. చరణ్ లో మంచి టాలెంట్ ఉందనీ స్పష్టం చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!