ప్రస్తుతం అన్ని నోటిఫికేషన్ల దరఖాస్తులు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి.. దగ్గరలోని ఇంటర్నెట్ షాప్ కి వెళ్లి ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తున్నారు.. అయితే ఆన్లైన్ లో ఏమైనా తప్పులు ఎంటర్ చేస్తే సరిచేసుకునే అవకాశం లేదు.. వెంటే అయితే మనం సరిచేసుకోవచ్చు..!
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోలీసు శాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు.. జనవరిలోనే ప్రకటన విడుదల చేయనుంది.. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియను మరింత సులువు చేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని పోలీసు నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు..! దీని వలన అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నారు..!
పోలీసు శాఖలో ప్రస్తుతం 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదు. 2018 లో 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి రావడంతో యాప్ వినియోగంపై దృష్టిసారించారు. మిగతా ఉద్యోగాల భర్తీ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. రాత పరీక్షలతోపాటు, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. తర్వాత సంవత్సరకాలం శిక్షణ ఉంటుంది.
ప్రత్యేక యాప్:
పోలీసు శాఖా లో గత రెండు నియామకాలను ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రక్రియ పూర్తి చేశాక తమ పేరు, కులం నమోదు తప్పు నమోదయ్యిందని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్యలను నివారించేందుకు ఈసారి నియామకాల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అభ్యర్థులంతా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లిన వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంది. నియామకాలకు సంబందించిన నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఆ యాప్ ద్వారా అభ్యర్థులు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అభ్యంతరాల స్వీకరణ, సందేహాల నివృతి ఇలా మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేకమైన యాప్ ను అభివృద్ధి చేస్తుంది. దీని ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.