NewsOrbit
న్యూస్

చేరిపోయారు గానీ చెయిరే దొరకడం లేదు!

bullet proof vehicle for ap agriculture minister kurasala kannababu

అధికార పార్టీలో ఉంటే ఏదో ఒకటి గిట్టుబాటు అవుతుందన్న ఆశతో పొలోమని వైసీపీలో చేరిన టిడిపి మాజీల పరిస్థితి మరి దారుణంగా వుందట.

joiner cant find the seat
joiner cant find the seat

చేర్చుకోవడం అయితే వెంటనే చేర్చేసుకున్న జగన్ వారికి పార్టీలో ప్రాధాన్యం లేదా పదవి ఇచ్చే యోచనలోనే లేరట. మొన్నటి ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీ పంచన చేరారు.ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు కూడా వైసిపికి మద్దతు ప్రకటించారు.వాస్తవ పరిస్థితి చూస్తే ఆ టిడిపి ఎమ్మెల్యేలకే వైసీపీలో ప్రాధాన్యం లేని పరిస్థితి.చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడికి చీరాల నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి పదవిని ఆశించి అధికార పార్టీ వైపు వెళ్లారు.

అది జరిగే అవకాశాలే లేవు.మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాలి గిరి పరిస్థితి కూడా వైసీపీలో ఏమాత్రం కంఫర్ట్బుల్గా లేదు.వీరిని పక్కన బెడితే టిడిపి మాజీ ఎమ్మెల్యేలు పలువురు వైసిపి తీర్థంపుచ్చుకున్నారు.వీరిలో శిద్దా రాఘవరావు కదిరి బాబూరావు, రెహమాన్ ,దేవినేని అవినాష్ పంచకర్ల రమేష్బాబు,తిప్పల గురుమూర్తిరెడ్డి ,చింతలపూడి వెంకటరామయ్య తదితర ప్రముఖులున్నారు.టీడీపీలో మంచి స్థానాల్లో ఉన్న వీరు ఎన్నికల్లో ఓడగానే వైసీపీ పంచన చేరారు. అధికార పార్టీలోకి వస్తే తమకు తగిన గౌరవం పదవులు దక్కుతాయని ఎంతో ఆశించారు.కానీ అలాంటి వాతావరణమే వైసిపిలో లేదని స్పష్టంగా గోచరిస్తుంది.

నిజానికి వైసీపీలోనే పదేళ్ల పాటు కష్టపడిన వారికి ఇపుడు కనీసం నామినేటెడ్ పదవి లేదు, చాలా మంది ఆశావహులకు నాడు ఎన్నికల్లో టికెట్లు జగన్ ఇవ్వలేదు, వారిని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తానని అప్పట్లో జగన్ప్రామిస్ చేశారు. కానీ జరిగింది వేరు. పదవులన్నీ సామాజిక సమీకరణలతో చాలా మందికి దక్కలేదు. ఇక జగన్ బీసీ మంత్రంతో కూడా అనేక మంది అవకాశాలు కోల్పోయారు. మరి కొన్ని చోట్ల పదవులకు ఎక్కువమంది పోటీ పడడంతో ఎవరికీ దక్కకుండా పోయాయి.

ఇలా వైసీపీలో పదవుల గోల ఓ రేంజిలో ఉంది. కానీ ఇపుడు వీరికి తోడు అంటూ పొలోమంటూ కొత్తవారు టీడీపీ, ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చేశారు.వీరందరికీ జగన్ఏం పదవులు ఇవ్వగలరు అన్నది జవాబు దొరకని ప్రశ్న. దీంతో వైసీపీలో చేరిన వారు ఇతర పార్టీల వారు తమకు చెయిరు దొరకడం లేదని ఆవేదన ఆవేదన చెందడం మినహా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.

author avatar
Yandamuri

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju