NewsOrbit
Featured బిగ్ స్టోరీ

రూ. 13 వేల కోట్ల డీల్ వెనుక..! జగన్ – మోడీ మధ్యలో అదానీ..!!

వేల కోట్లు ఊరకే చేతులు మారవు..!! క్లాజులుంటాయ్, కారణాలుంటాయ్, కోరికలుంటాయ్!! ఏపీలో అటువంటిదే తాజాగా ఓ డీల్ జరిగింది. ఓ పెద్ద పోర్టు అదానీ పరమయ్యింది. పోర్టులో 75 శాతం వాటా అదానీ చేతికి చిక్కింది..! ఇది ఊరికే జరిగే వ్యవహారం కాదు. రాజకీయమూ.., రాజీమార్గమూ.., చీకటి తంత్రమూ ఎన్నో ఈ డీల్ ని నడిపించాయి..!!

ముందు సూటిగా విషయం చూద్దాం..!!

నవయుగ అంటే బాగా తెలుసు అందరికీ..! ఆ నవయుగ చేతిలో రాష్ట్రంలో ఎన్నెన్నో ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒక్కోటీ చేతులు మారుతున్నాయి. తాజాగా ఏం జరిగింది అంటే..? నవయుగ చేతిలో ఉన్న కృష్ణపట్నం పోర్టు (నెల్లూరు జిల్లా)లో 75 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ అనే సంస్థకి వెళ్ళింది. సింపుల్ గా ఆదానీకి వెళ్ళింది. దీని విలువ రూ. 13 , 572 కోట్లు. ఇన్నాళ్లు నవయుగ పూర్తిస్థాయిలో వాటాదారుగా ఉండగా, తాజాగా 75 శాతం తీసుకుని పూర్తి అజమాయిషీ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది.

నవయుగ నుండి ఎందుకు తీసేసారు…?

ఇప్పుడు మరో కీలక విషయం చూసుకోవాలి. నవయుగ అంటే పెద్ద కంపెనీ. అంతర్జాతీయ చరిత్ర ఉంది. ఇంజనీరింగ్ పనులు, ప్రాజెక్టులు, స్టీల్, ఎక్స్పోర్ట్, ఐటీ, పవర్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా విభాగాల్లో నవయుగ ముద్ర ఉంది. కృష్ణపట్నం పోర్టుతో వారి సామ్రాజ్యం మరింత విస్తరించింది. ఈ కంపెనీనే చంద్రబాబు హయాంలో అనేక ప్రాజెక్టులు దక్కించుకుంది. పట్టిసీమను తీసుకుని గాయిత్రి వంటి చిన్న కంపెనీలకు సబ్ ఇచ్చేసింది. పోలవరం పనులను చేపట్టి చాలా కాలం చేసింది. చంద్రబాబు హయాంలో గిన్నిస్ రికార్డులనీ.., బొమ్మలు, ఫొటోలతో బాగా హడావిడి చేసింది. బందరు పోర్టు దక్కించుకుంది. ఇంకా ఉంటే రామాయపట్నం కూడా కొట్టేసేదే.

Bjp leaders praising ap cm ys jagan
Bjp leaders praising ap cm ys jagan

జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఆ కంపెనీకి చెందినవని రద్దు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుని మేఘా దక్కించుకుంది. బందరు పోర్టు రద్దయింది. తాజాగా కీలకమైన కృష్ణపట్నం పోర్టులో వాటా వెళ్ళిపోయింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే… నవయుగ ఏమి రాజకీయంగా జగన్ తో విభేదించలేదు. వైఎస్ ఉన్నప్పటి నుండి ఈ కుటుంబాల మధ్య ఓ అవగాహన ఉంది. అయితే జగన్ కి ఉన్న వేరే ప్రాధాన్యాలు, దృష్ట్యా ఈ మార్పులు చేర్పులు తప్పవు.

అదానీ ఎందుకు ఎంటర్ అయినట్టు..??

ఒకే. వాటా వెళ్ళింది. నవయుగ అలా తప్పుకుంది. కానీ అదానికే ఎందుకు ఇచ్చినట్టు..?? ఇతర చాలా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయిగా.., అంబానీ, మేఘా లాంటి వాళ్ళు ఉన్నారుగా అనే అనుమానాలు రావచ్చు. ఈ విషయం చెప్పుకుందాం..!! అంబానీకి, ఆదానీకి చాలా తేడా ఉంది. అంబానీ అందరి మనిషి. సోనియా, మోడీ, చంద్రబాబు, జగన్ ఇలా అందరితోనూ తాను బాగానే ఉంటారు. ఎవరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోడు. తన అవసరాలు, ప్రాధాన్యాలు తనకు ఉంటాయి. కానీ అదానీ అలా కాదు. అతనికి ఆమూలాగ్రం మోదీనే. మోడీ వచ్చిన తర్వాత అదానీ గ్రూపు బలం పదుల రెట్లు పెరుగుతుంది. ఇక మోడీ – జగన్ ల బంధం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అందుకే బీజేపీ – వైసీపీ మధ్యలో అదానీ అన్నమాట. కేంద్రంలో కార్పొరేట్ దిగ్గజాలుగా ఉన్న అంబానీ, ఆదానీలతో జగన్ ఇలా వియ్యం కుదుర్చుకున్నట్టు. నత్వానికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా అంబానీతో.., ఈ పోర్టు వాటా ద్వారా ఆదానీతోనూ వియ్యం కలిసినట్టే. ఇక కార్పొరేట్ ని రాష్ట్రంలో ఆపతరమా …? జగన్ – బీజేపీ బంధాన్ని శంకించతరమా..??!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju