NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జూ. ఎన్టీఆర్ నయా పార్టీ? హింట్ ఇచ్చేసిన వైసీపీ మంత్రి

తెలుగుదేశం పార్టీ నాయకులలో చాలామందికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టాలని మనసులో కోరిక ఉందన్న వార్తలు మనం ఎప్పటినుండో వింటున్నాం. అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు అసలు ఆ విషయంపై స్పందించింది లేదు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఆ విషయం అడిగినా కూడా దాటవేస్తూ ఉంటారు. విధి…. దేవుడు అంటూ…. అవి ఎలా చూపిస్తే అలా నడుచుకుంటానని చెబుతుంటారు. 

 

Kodali Nani Controversial Comments On Jr NTR | Vastavam TV

సరిగ్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఇంతకంటే మంచి సమయం ఎన్టీఆర్ కు దొరకదు. పార్టీ కొత్త గాలిని కోరుకుంటోంది. చంద్రబాబు వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. అయితే ఈ సమయంలో ఎన్టీఆర్ రాకపై అయితే తెలుగుదేశం నాయకులు కామెంట్లు చేయాలి కానీ ఏకంగా వైసీపీ మంత్రి అది కూడా జగన్ పరమభక్తుడు అతని పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడం అనేది ఇక్కడ విశేషం. 

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కచ్చితంగా ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఉంటుందని అయితే అతను తెలుగుదేశం పార్టీనే నడిపిస్తారా లేదా కొత్త పార్టీని పెట్టుకుంటారా అన్నది తెలియాల్సి ఉందని నాని అనడం గమనార్హం. నాని ఎన్టీఆర్ కు మంచి మిత్రుడు కూడా. అయితే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అతను టిడిపిలో చేరేది లేదా కొత్త పార్టీ పెట్టేది లేనిది ఆలోచించుకుంటాడు కానీ మొదట్లో అతని పొలిటికల్ జర్నీ మాత్రం మొదటి సజావుగా సాగే ప్రసక్తే లేదని నాని అన్నారు. 

చంద్రబాబు-లోకేష్ రూపంలో తండ్రీకొడుకుల ద్వయం ఎన్టీఆర్ ను రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడతారని నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా మరింత ఘాటుగా మాట్లాడుతూ లోకేష్ కి కనుక అసెంబ్లీ మెట్లు ఎక్కాలి అని ఉంటే కేవలం ఎన్టీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే అతనికి అది సాధ్యపడుతుందని చెప్పడం విశేషం. మరి నాని చెప్పినట్టు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

author avatar
arun kanna

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju