NewsOrbit
న్యూస్ సినిమా

సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండె పోటుతో మృతి

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

తెలుగు సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి (74) నేటి వేకువ జామున గుండె పోటుతో మృతి చెందారు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో కొద్ది నెలలుగా జయప్రకాష్ రెడ్డి గుంటూరులో ఉంటున్నారు. మంగళవారం వేకువజామున బాత్ రూమ్‌కు వెళ్లిన జయప్రకాష్ రెడ్డి ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందారు.

జయప్రకాష్ రెడ్డిది స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల గ్రామం. 1946 మే ఎనిమిదవ తేదీ జన్మించిన ఆయన బ్రహ్మపుత్రులు చలనచిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తన దైన నటనా శైలితో సినీ ప్రేక్షకులను అలరించారు.  సినీ రంగానికి రాకముందు జయప్రకాష్ రెడ్డి ఉపాధ్యాయుడుగా పని చేశారు. ప్రేమించుకుందాం రా. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకెశవరెడ్డి, బిందా, గబ్బర్ సింగ్, నాయక్, బాద్షా, రేసు గుర్రం, నేనే రాజు నేనే మంత్రి, సుప్రీం, ఖైదీ నెం.150, మనం, రెడీ, టెంపర్, సరైనోడు, రాజా దీ గ్రేట్, జై సింహా వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాని సంపాదించుకున్నారు. చివరగా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో  జయప్రకాష్ రెడ్డి నటించారు. కమెడియన్‌గా, విలన్‌గా తన రాయలసీమ యాస, భాషతో తెలుగు ప్రేక్షకులను రంజిపజేశారు.

జయప్రకాష్ రెడ్డి ఇక లేరు అని తెలియడంతో తెలుగు చిత్ర సీమలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. పలువురు సినీ రంగ ప్రముఖులు జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.

 

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri