Samantha: ఆషూ రెడ్డి.. అంటే తెలిసే ఉంటుంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అనుచరులకైతే బాగా తెలుస్తుంది. ఆ మధ్య వర్మ, ఆషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆషూ రెడ్డి కాళ్ళను చూస్తూ వర్మ చేసిన అతి చూపరులకు చిరాకు కలిగేలా చేసింది. ఈ తతంగం వర్మ అనుచరులకు నచ్చినా, జనాలు మాత్రం తెగ తిట్టుకున్నారు. కొంతమంది ఇది కూడా వర్మ పబ్లిసిటీ స్టెంట్ అని కొట్టిపారేశారు. మరి కొంతమంది ఆషూ రెడ్డి వర్మను ఫేమ్ కోసం భలే వాడుకుందని అన్నారు.
Samantha: ఆషూ రెడ్డి అలియాస్ జూనియర్ సమంత చేసిన వీడియో ఇదే..
బేసిగ్గా ఈమె పేరు ఆషూ రెడ్డి అయినప్పటికీ జూనియర్ సమంతగానే ఫేమస్ అయ్యింది. తాజాగా ఆమె పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ అయినటువంటి ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే కవర్ సాంగ్ కి డాన్స్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ఆ వీడియో యోట్యూబ్ ని షేక్ చేస్తోంది. జూనియర్ సమంత ఇరగదీసింది అంటూ కింద కామెంట్లు చేస్తున్నారు. ఇది వేరే లెవల్ డాన్స్ అంటూ కొందరు తెగ పొగిడేస్తున్నారు.
Mahesh babu: రాజమౌళికి ఊహించని జలక్ ఇచ్చిన మహేష్ బాబు..?!
‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ సాంగ్ ప్రత్యేకతలు:
సమంత అప్పటివరకు స్పెషల్ సాంగ్ లాంటివి చేయలేదు. అలాగే సామ్ నుండి హాట్ లుక్స్ ఎవరు ఊహించరు. అయితే వాటిని నిజం చేస్తూ సామ్ ఈ పాటలో రెచ్చిపోయింది. పుష్ప అనే సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. సామ్ అప్పటివరకు సాఫ్ట్ రోల్స్‌లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సమంతను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ పాట మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.