NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar16 Today Episode: హిమను అనాథను చేసిన సౌర్య.. మరోపక్క ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది.?

Karthika Deepam Mar16 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. కార్తీక్, దీప, మోనిత ముగ్గురు కూడా సీరియల్ నుంచి వెళ్లిపోవడంతో కార్తీకదీపం అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. కొత్త తరం వాళ్ళతో ఇకనుండి సీరియల్ ను కొనసాగించే ప్రయత్నం మొదలుపెట్టారు డైరెక్టర్ గారు. ఇక ఈరోజు కార్తీకదీపం సీరియల్లో ఏమి జరిగిందో తెలుసుకుందామా..గత ఎపిసోడ్‌లో హిమ ఇంటికి రావడం, ఇంట్లో ఉన్న సౌర్య.. ‘హిమ ఫొటో అమ్మా నాన్నల పక్కనే ఉండటానికి వీల్లేదు’ అని హిమ ఫోటోను వీధి గుమ్మం వైపు విసిరేస్తుంది. సరిగ్గా అదే సమయానికి హిమ గుమ్మం వైపు పరుగున వస్తూ ఆ ఫోటో విసిరేయడాన్ని చూసి అక్కడే ఆగిపోతుంది.

Karthika Deepam Mar 14 Today Episode: సౌర్య చేతి మీద ఉన్న హిమ పేరును తొలగించే పనిలో పడ్డ సౌర్య…!!పచ్చబొట్టు పోతుందా మరి..?

Karthika Deepam Mar16 Today Episode: సౌర్య కోపం… హిమను అనాథను చేయనుందా..?

ఈరోజు కూడా అదే సీన్ తో సీరియల్ కంటిన్యూ అవుతుంది. హిమ ఫొటో అమ్మా నాన్నల పక్కనే ఉండటానికి వీల్లేదు.అసలు దాని మాట, దాని జ్ఞ‌ాపకం ఏదీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు’ అంటూ గట్టిగ అరుస్తుంది సౌర్య. ఆ మాటలు విని హిమ షాక్ అవుతుంది.ఇంతలో ఆదిత్య ‘హిమని పరాయిదాన్ని చేసి మాట్లాడకమ్మా..’ అంటాడు. హిమ పరాయిదే బాబాయ్.. పరాయిదే.. నాకు అమ్మా నాన్నలని లేకుండా చేశాకా అది నాకు ఎప్పటికీ ఏమీ కాదు.. అయితే గియితే నాకు శత్రువు అవుతుంది అంతే అంటుంది. కారు డ్రైవ్ చెయ్యాలనే హిమ కోరికే ఈరోజు అమ్మని నాన్నని చంపేసింది.వద్దు వద్దు అని అమ్మా ఎంత చెప్పినాగాని మొండిగా కారు డ్రైవింగ్ చేసింది కాబట్టే ఈ రోజు అమ్మా నాన్నా నాకు లేకుండా పోయారు అంటుంది సౌర్య ఏడుస్తూ.. ‘చెల్లెల మీద ఇంత కోపం పెంచుకుంటే ఎలా సౌర్యా’ అంటుంది సౌందర్య. ‘అలాంటి చెల్లి నాకొద్దు’ అంటూ అరుస్తుంది సౌర్య.

Karthika Deepam Mar 15 Today Episode: సీరియల్ నుంచి మోనిత కూడా అవుట్..!?
హిమను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చిన సౌర్య:

ఈ మాటలు అన్ని హిమ బయట నుండి వింటుంది. ఇక సౌందర్య నువ్వు నమ్మినట్లే నీ చెల్లెలు హిమ బతికి వస్తే కాదనగలవా?’ అంటుంది సౌందర్య బాధగా.‘నిజంగానే హిమ బతికి బయటపడినా నా కళ్ల ముందుకు రాకపోతేనే మంచిది అది కనుక వచ్చిందా నాకున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలియదు నానమ్మ. నాకు తెలుసు హిమ బతికే ఉంటుంది. ఏదొకరోజు నాకు ఎదురు పడుతుంది.అప్పుడు దాన్ని ‘చంపేస్తాను..’ అంటూ అరుస్తుంది సౌర్య ఆవేశంగా.. ‘అలా మాట్లొద్దమ్మా’ అంటాడు ఆనందరావు. మీకు హిమే కావాలంటే నేను కూడా అమ్మానాన్నల దగ్గరకే వెళ్లిపోతాను. మళ్లీ దాని పేరు ఈ ఇంట్లో ఎవరైనా ఎత్తితే నేను మీకు దక్కను అని ఏడుస్తూ అరుస్తుంది. సౌర్య బాధ చూసి సౌందర్య, శ్రావ్య, ఆనందరావు, ఆదిత్యలు దగ్గరకు వచ్చి సౌర్యని పట్టుకుంటారు.

మోనిత ఇంటికి వెళ్లిన హిమకు ఆనంద్ గురించి తెలుస్తుందా?

వెనుకే ఉన్న హిమ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఏడుస్తూ వెళ్లిపోతుంది.అక్కడ సీన్ కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. సీన్ కట్ చేస్తే హిమ బస్తీలోని మోనిత ఇంటికి వెళుతుంది. తలుపులు తీసే ఉండాలనే మోనిత చివరి కోరికతో తలుపులు తీసే ఉంటాయి.ఇక హిమ ఇంట్లోకి వెళ్లి ఆంటీ ఆంటీ..’ అంటుందు.ఎవ్వరూ ఉండరు ఇంట్లో గోడ మీద ఉన్న కార్తీక్, మోనితల ఫొటో చూసి ‘ఇదేంటి డాడీ మోనిత ఆంటీతో కలిసి పూజ చేశాడా అని షాక్ అవుతుంది.అలాగే ఆ పక్క గోడ మీద ఉన్న మోనిత ఆనంద్‌ని ఎత్తుకున్న ఫొటో చూసి తమ్ముడ్ని ఆంటీ ఎత్తుకోవడం ఏంటీ? నాకేం అర్థం కావట్లేదు అంటుకుంటుంది.తమ్ముడు మోనిత ఆంటీ దగ్గర ఉండటమేంటీ? మోనిత ఆంటీ డాడీ ఫ్రెండ్ కదా అనుకుని అయినా అబద్దాలు చెప్పడం ఇంట్లో అందరికీ అలవాటే కదా అనుకుంటుంది హిమ మనసులో. ఆ తరువాత మనిద్దరి మధ్యా అంత చేసిన మోనితాని..’అంటూ కార్తీక్, దీపలు మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటూ.. ‘తమ్ముడు మోనిత ఆంటీ కొడుకా? అసలు ఏం అర్థం కావట్లేదు నాకు అని బాధగా అనుకుంటుంది.

ఇంద్రుడు, చంద్రమ్మతో ఉండిపోతానన్న హిమ :

ఇంతలో బయట నుంచి ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు’అనే అరుపులు వినిపించి బయటికి పరుగుతీస్తుంది హిమ. ఓ పోలీస్ కానిస్టేబుల్ మౌనిత ఇంటి గుమ్మం బయట ఉన్న ఇంద్రుడు, చంద్రమ్మలని నిలదీస్తుంటాడు. అది చూసిన హిమ.. ‘వాళ్లు మా బాబాయ్, పిన్నీ అంటుంది.చిక్ మంగుళూర్ నుంచి మోనిత ఆంటీని కలవడానికి వచ్చాం మేము’ అంటుంది అని పోలీస్ కు ఏదో సర్ది చెబుతుంది హిమ. దానితో పోలీసు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చంద్రమ్మ ప్రేమగా హిమని దగ్గరకు తీసుకుని ‘భలే బాగా సమాధానం చెప్పావు తల్లీ..’ అంటూ ముద్దాడి మీ వాళ్లని కలిశావా తల్లీ?’ అంటుంది చంద్రమ్మ హిమతో.. లేదు అని చెప్పి ‘నేను ఎప్పటికీ మీతో ఉండిపోవచ్చా’ అంటుంది జాలిగా హిమ. వెంటనే చంద్రమ్మ హిమని దగ్గరకు తీసుకుని హత్తుకుని అలాగే అంటుంది.కానీ ఇంద్రుడు మాత్రం వాళ్ల వాళ్లని కలిసి బిడ్డని వాళ్లకి అప్పగిద్దామే అంటే నువ్వు ఊరుకో అయ్యా.. బిడ్డకు ఏం కష్టం వచ్చిందో ఏమో.. మనతో ఉంటా అంటోంది కదా ఉండనీ అంటుంది చంద్రమ్మ. ఇక సౌందర్య ఇంట్లో కార్తీక్ ఫొటో ముందు సౌర్య కూర్చుని ఏడుస్తూ ఉంటే మరోపక్క సౌందర్య మోనిత చేసిన పనులను తిట్టుకుంటూ కార్తీక్, దీపలను పొగుడుకుంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju