” ఖిలాడి ” ఇండస్ట్రీ రికార్డ్ పక్కా .. ఫ్లాపుల్లో ఉన్న ఏ హీరో అయినా రవితేజ ని ఫాలో అవండి ..!

మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సినిమాలు ఎంతో నమ్మకం పెట్టుకొని చేస్తే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడానికి లేకుండా పోయాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

Ravi Teja's Khiladi First Look: Impactful | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఈ క్రమంలో మాస్ రాజా రీసెంట్ గా తన లేటెస్ట్ సినిమాని ప్రకటించాడు. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో ఖిలాడి అనే సినిమా చేయబోతున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. గతంలో రమేష్ వర్మ రవితేజతో ‘వీర’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే రమేష్ వర్మ డెబ్యూ సినిమా ‘రైడ్’ ని కొరియన్ సినిమా ఆధారంగా తీసి హిట్ కొట్టాడు. అలాగే తమిళ హిట్ ‘రాక్షసన్’ను బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

దాంతో ఇప్పుడు మరో సినిమాని తెలుగులో రవితేజ తో ‘ఖిలాడి’ గా రూపొందించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకముందు తమిళంలో అరవింద్ స్వామి, త్రిష నటించిన ‘శతురంగ వేట్టై-2’ కథతోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. గతంలో కోలీవుడ్ లో ‘శతురంగ వేట్టై’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. తెలుగులోనూ ‘బ్లఫ్ మాస్టర్’గా రీమేక్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే శతురంగ వేట్టై కి సీక్వెల్ గా ‘శతురంగ వేట్టై-2’ తెరకెక్కినప్పటికి రిలీజ్ కాకుండా ఆగిపోయింది.

కాగా ఇప్పుడు రమేష్ వర్మ – రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఖిలాడి ఈ సినిమా రీమేక్ అని తెలుస్తోంది. ఆ విషయం రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రి లుక్ ఫస్ట్ లుక్ పోస్టర్లలో డబ్బు కట్టలు కనిపిస్తుండటం తో పాటుగా సినిమాకి ‘ఖిలాడి’ అనే టైటిల్ ప్రకటించడం తో ఖచ్చితంగా ఈ సినిమా రీమేక్ అని చెప్పుకుంటున్నారు. అయితే కథ లో దమ్ము ఉంది కాబట్టి ప్రస్తుతం రవితేజ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి కథ అయితే మళ్ళీ సకస్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ కమిటయినట్టు సమాచారం.