NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ఈసారి తెలంగాణలో ఎన్నికలు హోరాహోరిగా జరగనున్నాయి. మరి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలలో పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే రాజధానిలో అంతర్భాగంగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు సీటు రేసు రసవత్తరంగా మారింది. ఈ ఎంపీ సీటు కోసం అధికార కాంగ్రెస్ – ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి నేతల నుంచి దిగ్గ‌జాలు పోటీపడుతున్నారు. బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పోటీ చేయటం ఖాయం. ఎప్పటికే ఆయన పేరు కూడా ఖరారు అయింది. ఆయనకు సికింద్రాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎవరు ప్రత్యర్థులుగా ఉంటారు అన్న విషయంలో నిన్న మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

Kishan Reddy win this time in Secunderabad... this logic is true.
Kishan Reddy win this time in Secunderabad… this logic is true.

కానీ ఇప్పుడు గ్రేటర్ పరిధిలో కీలక నేతలుగా ఉన్న వారే అక్కడ పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ప్రస్తుతం ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్, బిఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ పోరు హెరాహోరీగా సాగనుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం చాలాసార్లు బిజెపికి కంచుకోట‌గా ఉంటూ వస్తుంది. గతంలో ఇక్కడ రెండుసార్లు బిజెపి గెలిచింది. మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. ఆ తర్వాత 2019 ఎన్నికలలో కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీలుగా గెలిచారు.

అయితే సికింద్రాబాద్లో మ‌జ్లిస్‌ పోటీ చేస్తే బిజెపికి తిరుగులేని విజయం దక్కుతుంది. కానీ గతంలో బిఆర్ఎస్ తో ఉన్న అవగాహన మేరకు మజ్లిస్ పోటీ చేయలేదు. ఈసారి కాంగ్రెస్తో మజిలీ ఆ మేరకు అవగాహన పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయటంలోనే చాలా ప్రత్యేకమైన వ్యూహం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తన కుమారుడికి సీటు కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికలలో తలసాని కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేసి కిష‌న్‌రెడ్డి చేతిలో 60 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయితే ఈసారి కూడా తన కుమారుడికి సికింద్రాబాద్ పార్లమెంటు సీటు ఇప్పించుకునేందుకు శ్రీనివాస్ యాదవ్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే హై కమాండ్ మాత్రం తలసానినే బరిలోకి దించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక నాంపల్లిలో మాత్రమే మజిలీస్ గెలిచింది. ఈ 6 నియోజకవర్గాలలో దానం నాగేందర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఖైరతాబాద్, తలసాని శ్రీను ఎమ్మెల్యేగా ఉన్న సనత్ నగర్ కూడా ఉన్నాయి.

విచిత్రమైనటువంటి ఈసారి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఒక బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేయటం ఖాయం అయినట్టే. అటు కిష‌న్‌ రెడ్డికి సొంత నియోజకవర్గ అంబర్ పేట ఉన్న గత ఎన్నికలలో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇక నాంపల్లిలో మజిలీస్‌ ఎమ్మెల్యే ఉన్నారు. ఈసారి ఓస్లిం మోటర్ల మద్దతు కాంగ్రెస్కు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో నాంపల్లిలో మజ్లిస్‌ గెలిచినా అక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవడంతో పాటు గట్టి పోటీ ఇచ్చింది. ఏది ఏమైనా ఈసారి ఎలా చూసినా కిషన్ రెడ్డి గెలుపు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంత ఈజీ కాదని రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju