Krithi Shetty: ఈ మధ్య కాలంలో యువతలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బేబమ్మ .. ఉప్పెన సినిమా విడుదల అయినప్పటి నుంచి ఈ పేరు మారుమోగిపోతుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా అయిన ఉప్పెన బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. మెగా హీరోస్ లో డెబ్యూ సినిమాకి ఇన్ని కలెక్షన్స్ వచ్చింది కేవలం వైష్ణవ్ కి మాత్రమే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాని ముందుగా ఓటీటీ లోనే రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు కానీ లాక్ డౌన్ ని సడలించాక నేరుగా థియేటర్ లలోనే విడుదల చేశారు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. మొదటి సినిమాతోనే తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమా ని చుసిన చిరంజీవి అప్పటిలోనే కృతి నటన అద్భుతం అని నిర్మాతలు ఆమె డేట్స్ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోవాలని సినిమా రిలీజ్ అయితే ఆమె దొరకడం కష్టం అని అన్నారు. ఆయన అన్నట్టుగానే బేబమ్మ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకోగా మరో మూడు చిత్రల కి సంప్రదింపులు జరుపుతుంది. ఆఫర్లకు తగ్గట్టే ఆమె రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
తన మొదటి సినిమాకు రూ. 20 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకోగా ఇపుడు ఆమె తన రెమ్యూనరేషన్ ని రూ. 70 లక్షలకు పెంచిందట. ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు రూ. 70 లక్షలు అలాగే ఆ తరువాత కంఫర్మ్ చెయ్యబోయే సినిమాలకు అంతకు మించి అంటుందట కృతి శెట్టి. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందాన్ని బాగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!