Liger : ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా ముఖ్యం. సినిమా ఎత్తుగడ, ఇంట్రవెల్, ప్రీ క్లైమాక్స్..క్లైమాక్స్ ఇవన్నీ స్క్రిప్ట్ లో పక్కాగా కుదిరితే సినిమా డ్రైవ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ నెరేషన్లో గనక కన్ఫ్యూజన్ లేకపోతే సినిమా చూసే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. సీటు అంచున కూర్చిని సినిమా చూస్తారు. అలాంటి సినిమాలు చాలా తక్కువగా ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. ఎక్కువగా డిజిటల్ కంటెంట్ ఎక్కువవడంతో బోల్డ్ కథాంశాలతో సినిమాలు నిర్మిస్తున్నారు. జనాలు గత ఏడాదిగా వాటికే అట్రాక్ట్ అవుతున్నారు.
ఇదంతా కరోనా మహిమ. గత ఏడాది నుంచి దీని నుంచి ఇండస్ట్రీలు కోలుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలకైతే వేల కోట్లలో నష్టం వాటిల్లినట్టే అని చెప్పుకుంటున్నారు. ఎన్ని వేల కోట్లలో నష్టం జరిగి ఉంటుందో ఊహించడం కూడా కష్టంగా మారింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలు రెడీ అవుతున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయి అన్నీ పరిస్థితులు సద్దుమణిగితే మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ వైభవం తీసుకు వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి.
Liger : ఎమోషనల్ క్లైమాక్స్ లైగర్ సినిమాకి ఆయువు పట్టు
ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధే శ్యాం, పుష్ప, లైగర్, మేజర్, గని, సలార్, ఆదిపురుష్, నారప్ప, ఖిలాడి, అఖండ, విరాట పర్వం, సర్కారు వారి పాట, ఎఫ్ 3, హరిహర వీరమల్లు, ఏకే రీమేక్..ఇలా చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. కాగా పూరి జగన్నాథ్ – విజయ్ దేవర కొండ – అనన్య పాండే సినిమా లైగర్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. దీనికి పూరి రాసిన క్లైమాక్స్ తో భారీ సక్సెస్ రావడం గ్యారెంటీ అంటున్నారు. పూరి రూపొందిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా లైగర్ కావడం విశేషం. పాన్ ఇండియన్ సినిమాని అందరికంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి ఆయువు పట్టు అని చిత్ర బృందం ధీమాగా ఉన్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!