Liger: మంచి ఫామ్ లో ఉన్న టైమ్లో వరుస ఫ్లాపులు రావటంతో.. రౌడీ విజయ్ దేవరకొండ కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లయింది. మనోడు హిట్ కొట్టి చాలా కాలం అయిపోవడం తో పాటు వచ్చిన సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో.. విజయ్ దేవరకొండ హెటర్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్లింగ్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లి.. కెరటంలా లేచిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే పాన్ ఇండియా మూవీ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఏర్పడ్డాయి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇటువంటి తరుణంలో సినిమాలో విజయ్ దేవరకొండ.. బాక్సర్ తరహా పాత్ర చేయటం మాత్రమే కాక మాఫియా బ్యాక్ డ్రాప్ లో… ఓ పెద్ద డాన్ కొడుకు… గా కనిపించనున్నట్లు వార్తలు రావడంతో సినిమా రిలీజ్ కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరగటంతో పాటు మరోపక్క థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి చాలావరకు కనపడక పోవటంతో తాజాగా ఈ సినిమాకి ప్రముఖ ఓటిటి సంస్థ… 200 కోట్లు ఆఫర్ చేసినట్లు ఇటీవల వార్తలు రావడం తెలిసిందే.
Read More: Vijay Deverakonda: పూరి జగన్నాథ్ -విజయ్ దేవరకొండ కి మైండ్ బ్లోయింగ్ బంపర్ ఆఫర్..??
దీంతో ఈ సినిమా థియేటర్ లో కాకుండా ఓటిటి లో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎట్టిపరిస్థితుల్లో సినిమా థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నట్లు.. వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని విజయ్ దేవరకొండ తాజాగా క్లారిటీ ఇచ్చారు. కొద్దిపాటి సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అని ఖచ్చితంగా సినిమా థియేటర్ లోనే రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.