Liger: వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ లోకి ఎక్కుతాడు అని.. పూరి కచ్చితంగా లైఫ్ ఇస్తాడని విజయ్ దేవరకొండ అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క పూరిజగన్నాథ్ తన కెరియర్లో.. ది మోస్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటూ..‘లైగర్’ సినిమా తనకి స్పెషల్ అంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ అనేది సినిమాకి.. క్యాప్షన్. ఇదిలా ఉంటే సినిమాల్లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నట్లు ఫస్ట్‌లో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన టైంలో.. ఫోటో తో సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వటం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో ఫోటో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. బాక్సింగ్ కేజ్ లో.. బ్యాక్ బాడీ చూపిస్తూ.. చాలా స్టైలిష్ లుక్ లో.. ఉండే రీతిలో ఫోటో రిలీజ్ చేశాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. దీంతో ఈ ఫోటో చూసిన అభిమానులు .. నో డౌట్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అని అంటున్నారు. కాగా కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు ఫోటో ద్వారా విజయ్ దేవరకొండ అభిమానులతో.. కొత్త అప్డేట్ పంచుకోవడం జరిగింది. పొడవాటి జుట్టు తో షర్ట్ లేకుండా బాక్సింగ్ రింగ్ లో… విజయ్ దేవరకొండ స్టైల్…కి చాలామంది ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఈ సినిమా పోటీలో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు రాగా.. వచ్చిన వార్తలను ఖండించిన కచ్చితంగా సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు.
ఈ సినిమాపై విజయ్ దేవరకొండ చాలా అంచనాలు ఆశలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా చేస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాతగా వ్యవహరిస్తూ మరోపక్క సంయుక్త నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్.. కూడా నిర్మాతగా సినిమా కి ఉన్నారు. బాలీవుడ్ తో పాటు అనేక భాషలలో సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!