NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ కి మొట్టమొదటి సారి ముచ్చెమటలు పట్టిస్తున్న నారా లోకేష్..!

ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో ఆంధ్ర ప్రదేశ్ నుండి వస్తున్న ఒక వాహనంలో … ఆరంబాక్కం చెక్ పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు దాదాపు ఐదు కోట్ల రూపాయల మొత్తాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆవాహనం పైన ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉండడం రాష్ట్రంలో పెద్ద చర్చ లేపింది. ఇకపోతే బాలినేని శ్రీనివాస్ మాత్రం తనకు దానితో ఎటువంటి సంబంధం లేదని దానికి సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాడు.

 

Nara Lokesh appeals for generous donations

ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ వైసీపీపై విపరీతంగా విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో మంత్రి బాలినేని పై మరియు అధికార వైసీపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మంత్రి బాలినేని హవాలా ‘అడవి’ని పెంచడానికి ఏ ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ని ఉపయోగించారు. పూర్తి ‘ఎనర్జీ’తో ఈ తంతు నడపడానికి సేఫ్‌ ‘ఎన్విరాన్‌మెంట్‌’ని ఎవరు సృష్టించారు? విశ్వసనీయ కథనం ప్రకారం తమిళనాడులో పట్టుబడిన రూ.5.27 కోట్లు రూ.1200 కోట్లలో ఓ చిన్న భాగం. గత ఏడాది కాలంలో ఆ మొత్తం చెన్నై – బెంగళూరు మీదుగా హవాలా మార్గంలో మారిషస్‌ తరలించారు. దీని వెనుక ఉన్న కింగ్‌పిన్‌ ఎవరు? బాలినేని, జే ఫ్యామిలీని కాపాడుతున్నారు? లేక జే కుటుంబమే బాలినేని రక్షిస్తోందా!’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఇకపోతే అధికారంలో నేతలపై 1200 కోట్ల రూపాయలు హవాలా చేస్తున్నారని లోకేష్ ఆరోపించడం మరియు అతని మాటలు వెనుక వైసీపీ హైకమాండ్ ను ముఖ్యంగా ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగమ్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా ధైర్యంగా లోకేష్ ట్వీట్ వేశారంటే దాని వెనుక పెద్ద కారణమే ఉంటుందని వారి నమ్మకం. నిప్పు లేకుండా పొగ రాదన్నట్టు.. హైకమాండ్ కు తెలియకుండా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోలోపల ఏం చేశారో అని రాష్ట్ర ప్రజల్లో అనుమానం స్టార్ట్ అయిపోయిండి.

 

నిజంగా లోకేష్ తన వద్ద కొన్ని సమాచార వనరులు ఉన్నాయని…. అధికార పక్షం నుండి పెద్ద మొత్తంలో హవాలా జరుగుతోందని చెబుతుండడంతో అందుకు సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని లోకేష్ కనుక బయట ప్రస్తావిస్తే వైసిపి తీవ్ర ఇరకాటంలోకి పడుతుంది. నిజంగా అలా హవాలా జరిగింది అని చిన్న ఆధారం కానీ… హింట్ కానీ లోకేష్ బయటపెట్టాడు అంటే తర్వాత విషయం హైకోర్టు చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంపై త్వరగా లోకేష్ కానీ బాలినేని గాని స్పష్టత ఇచ్చే వరకు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో టెన్షన్ అలాగే ఉంటుంది.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N