Love Story Release Date: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా లవ్ స్టోరీ. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది కరోనావైరస్ రాకముందు రిలీజ్ కావాల్సింది. సరిగ్గా ఏప్రిల్ మాసంలో 2020 లో.. విడుదల అవుతుంది అని అందరూ భావించిన టైంలో మహమ్మారి కరోనా వైరస్ రావటంతో దేశంలో లాక్ డౌన్ విధించడంతో.. సినిమా థియేటర్లు క్లోజ్ అవటంతో ఆ సమయంలో రిలీజ్ వాయిదా పడింది. అనంతరం దేశంలో పరిస్థితులు సద్దుమణిగాక.. సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్న టైమ్ లో… సినిమా యూనిట్ రిలీజ్ చేయలేదు. ముఖ్యంగా సినిమా థియేటర్లకు జనాలు కరోనా కారణంగా రావటానికి భయపడటంతో.. పెద్దగా మార్కెట్ లేకుండా ఉండటంతో.. ఆ సమయంలో వాయిదా వేస్తూ వచ్చారు.
ఆ తర్వాత అనేక సినిమాలు రిలీజ్ అయినా గాని.. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కానీ పరిస్థితి. దీంతో చాలా వరకు లవ్ స్టోరీ ఓటిటి లో విడుదలవుతుందని సినిమా ప్రేక్షకులు భావించారు. అదే సమయంలో అనేక వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. కానీ ఖచ్చితంగా సినిమా.. థియేటర్ లో రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ అప్పట్లో క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు చాలా వరకూ బయట పరిస్థితులు సద్దుమణిగాక టంతో పాటు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో థియేటర్లు తెరుచుకోవడం తో.. లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 10 వ తారీకు రిలీజ్ చేయటానికి రెడీ అయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో వచ్చే నెల సినిమా రిలీజ్ అవుతుందని చెప్పటంతో సాయిపల్లవి అదే రీతిలో నాగచైతన్య అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!