MAA Elections: బండ్ల గణేష్ వ్యాఖ్యలకు జీవిత రాజశేఖర్ ఇచ్చిన కౌంటర్ ఇదీ..!!

Share

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి రాజుకొంటోంది. ఇప్పటికే పోటీ చేస్తున్న సినీ నటులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుతుండటం మా లో చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించిన ప్రకాష్ రాజ్ దాదాపు వంద మందికిపైగా మా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత తన ఆరు నెలల ప్రణాళికను నిన్న ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన ప్యానెల్ నుండి బయటకు వచ్చిన నిర్మాత బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజు సమావేశంలో బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తూ ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు. బయటకు వెళితే కరోనా భయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ల కోసం కళాకారులను ఒకే చూటకు చేర్చకండి, ఒక వేళ కరోనా సోకినట్లైయితే చాలా సమస్య అవుతుంది. దయచేసి ఇలాంటి మీటింగ్ లు పెట్టవద్దు, ఓట్లు అడగాలి అనుకుంటే ఫోనే చేసి అడగండి అంటూ బండ్ల గణేష్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

MAA Elections: jeevitha rajashekar counter on bandla ganesh comments
MAA Elections: jeevitha rajashekar counter on bandla ganesh comments

అయితే బండ్ల గణేష్ వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్ స్పందించారు. గణేష్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూనే పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేసుకుంటున్నామనీ, ఇప్పుడు కోవిడ్ పట్ల ప్రజలందరికీ పూర్తి అవగాహన ఉందన్నారు. మెడికల్ పరంగా కోవిడ్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ అర్థమైందన్నారు. కోవిడ్ వచ్చిన వారు కోలుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందనీ, దాని ప్రకారమే అందరం కలుసుకుంటున్నాం, పనులు కూడా చేసుకుంటున్నామని అన్నారు. అలానే అన్ని రూల్స్ ను పాటిస్తూనే మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడికి వేలాది మంది జనాలు రాలేదనీ, తొక్కిసలాట వంటివి ఏమీ జరగలేదని సెటైర్ వేశారు.


Share

Related posts

SEC : ప్రభుత్వం VS ఎస్ఈసీ కొత్త పంచాయతీ – మళ్లీ కోర్టుకు తప్పదా?

somaraju sharma

RRR Arrest: ఆర్ ఆర్ ఆర్ ను అమిత్ షా ఆదుకునేనా! ఎంపీ పిల్లల ఫిర్యాదుపై ఆయన స్పందన ఏమిటో !

Yandamuri

పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ వెనుక…?

arun kanna