తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎందుకు పెట్టబోతున్నారు ఆయనకు ఎవరి మద్దతు ఉంది అన్న చర్చలు మొదలయ్యాయి.
రాజకీయ పరిశీలకులు ఈ విషయమై ఆరా తీయగా ఆసక్తికరమైన సంగతి బయటకొచ్చింది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీ తోనే. టిడిపి అధినాయకుడు చంద్రబాబు నాయుడు ని రేవంత్ రెడ్డి రాజకీయ గురువుగానే చెప్పాలి. చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న విషయం కూడా తెలిసిందే .తదుపరి పరిణామాల్లో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లారు .ఎంపీ అయ్యారు.
ఇప్పుడు ఆపార్టీలో అగ్ర నేతగానే ఉన్నారు.అయినప్పటికీ రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏ మాత్రం చెక్కుచెదర లేదంటారు . ఇప్పుడు కూడా అదే చంద్రబాబు నాయుడు రేవంతరెడ్డి చేత సొంత పార్టీ పెట్టించే పనిలో ఉన్నారట.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు చురుకుగా లేరు.తెలంగాణలో టిడిపి దాదాపు కనుమరుగైంది .పేరుకే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వారు కూడా టిడిపిలోనే కొనసాగుతారా అన్న అనుమానం. అయితే చంద్రబాబు మాత్రం కెసిఆర్ ని బద్ధ శత్రువుగా చూస్తున్నారు.
తన శిష్యుడి వేలితో నైనా కెసిఆర్ కంట్లో పొడవాలన్నది చంద్రబాబు వ్యూహం అంటున్నారు. రేవంత గనుక కొత్త పార్టీ పెడితే టీడీపీ కేడర్‌తో పాటు కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గం పెడితే, తెలంగాణలో వివిధ పార్టీల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులు మొత్తం ఆయన వెంట వచ్చే అవకాశం ఉంది.కెసిఆర్ ని కొద్దిగానైనా నిలువరించ గలిగేది రేవంత్‌రెడ్డి అన్నది చంద్రబాబు నిశ్చితాభిప్రాయం ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో సొంతంగా రేవంత్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు సూచించారని, అందుకే రేవంత్ సొంత పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారన్నది తెలంగాణలో వినిపిస్తున్న టాక్ .వారిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని పరిశీలిస్తే ఇందులో వాస్తవం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు .