స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోహన్ బాబు నుండి ఒక సర్ప్రైజ్ వచ్చింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రం ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు లుక్ ఆకట్టుకుందనే చెప్పాలి.
ముఖ్యంగా ఇందులో మోహన్ బాబు ఉగ్రరూపుడై ఉన్నాడు. సెటప్ అదీ చూస్తుంటే మరో భారతీయుడు తరహా చిత్రం రూపొందుతోందేమో అని అనిపిస్తోంది. ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ కింద గురువారం, 2002 అని ఉంది. దానికి కల ప్రాధాన్యం తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశముంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!