Aadhi Pinisetty-Nikki Galrani: అనుకున్నదే అయింది. టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి సంజన గల్రానీ చెల్లెలు, కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి ప్రేమాయణం నడిపిస్తున్నాడని.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడా ప్రచారమే నిజమైంది. మార్చి 24వ తేదీని నిక్కీ, ఆది పినిశెట్టిలు ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆది సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపాడు. `జీవితంలో ఒకరినొకరు పట్టుకుని నడవడం అతి ముఖ్యమైంది. అలా జీవితాంతం ఉండగలమనే విషయాన్ని మేం ఇద్దరం గత కొన్నేళ్ల క్రితమే కనుగొన్నాం.
ఇప్పుడు అది అధికారకమైంది.. 24.03.2022 మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. కుటుంబ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. మా ఈ ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి` అంటూ ఆది ట్వీట్ చేశాడు. అలాగే ఎంగేజ్మెంట్కు సంబంధించిన కొన్ని ఫొటోలను సైతం షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, `యాగవరాయినుం నా కాక్క` అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది.
ఈ సినిమా చేస్తున్నప్పుడే నిక్కీకి, ఆదితో పరిచయం ఏర్పడిందట. ఈ పరిచయం కాస్త ప్రేమగా మరగా.. ఇప్పుడు ఈ జంట నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వరకు వెళ్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!