బాలీవుడ్ స్టార్స్ డిజిటల్ స్పేస్‌లోకి ఎంటరవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించడానికి మొగ్గుచూపుతున్నారు. మొన్నటికి మొన్న మాధురీ దీక్షిత్ … ఇప్పుడు తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ పైకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ మిస్టర్ పర్ఫెక్ట్ రెడీగా ఉన్నాడని సమాచారం. మంచి కథ దొరికితే చాలు దాని కోసం ఏదైనా చేసే ఆమీర్.. తన ఆలోచనలకు సరైన మార్గం ఓటీటీ అని భావిస్తున్నాడట. వీలైనన్ని ఎక్కువ కథలను ప్రేక్షకులకు అందివ్వొచ్చనేది ఆమీర్ ఆలోచనట. దీనికోసం తనే సొంతంగా ఓటీటీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం.
ఆమిర్ ఆప్తుడు ఆమీన్ హాజీ.. ఈ ఏర్పాట్లలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు ఆమీర్. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలకానుంది. ఇదిలా ఉంటే ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్‌లో పలు టైటిళ్లను ఆమీర్ రిజిస్టర్ చేశాడు. ఇవన్నీ ఓటీటీ కోసమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!