NewsOrbit
న్యూస్ సినిమా

# RC 15: శంకర్, చరణ్‌లకు చుక్కలు చూపిస్తున్నారుగా..దిల్ రాజుకు పెద్ద దెబ్బేనా..?

#RC 15: సినిమా ఇండస్ట్రీలో గతకొంతకాలంగా సినిమాకు సంబంధించిన సాంగ్స్, పోస్టర్, సీన్స్ లీకవుతూనే ఉన్నాయి. అత్తారింటికి దారేది సినిమా ఎకంగా గంటకు పైగా సినిమా యూట్యూబ్‌లో వచ్చేసింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి కూడా ఇలాగే లీకైంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాల సమయంలో చాలానే లీకులు మేకర్స్‌ను భయపెట్టాయి. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్నల కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా నుంచి చాలానే లీకయ్యాయి. ఆ సమయంలో నిర్మాతలు లీకురాయళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

again leaks from rc-15
again leaks from rc-15

అలాగే ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా నుంచి ఏకంగా సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఎన్నో రోజులు కష్టపడి సాంగ్ రెడి చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇద్దామనుకుంటే ఈ లోపే కొన్ని గంటల ముందు లీకురాయుళ్ళు సాంగ్ మొత్తాన్ని యూట్యూబ్‌లో ఎక్కించేశారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ చాలా బాధపడింది. ముఖ్యంగా చిత్ర సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ చాలా ఎమోషన్ అయ్యాడు. ఈ మేరకు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో వాయిస్ మెసేజెస్ పెట్టి హాట్ టాపిక్ అయ్యారు. చేసేదేమీ లేక ఒకరోజు ముందుగానే సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

# RC 15: మరోసారి వార్నింగ్ ..?

నెట్‌లో లీకైనా కూడా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఇవన్నీ చూసిన శంకర్ బృందం ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా రూపొందుతున్న ఆర్సీ 15 మూవీకి సంబంధించిన ఎలాంటి లీక్స్ జరిగినా ఊరుకునేది లేదని ఇటీవల కొత్త షెడ్యూల్ మొదలు పెట్టినప్పుడు చిత్రబృందానికి హెచ్చరికలు జారీ చేశారు. అయినా తాజాగా చరణ్ కొత్త లుక్‌ను లీక్ చేశారు. ఆ లుక్‌కు సంబంధించిన ఫొటోస్ కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి వార్నింగ్ ఇస్తూ ఈ సినిమా నుంచి ఇకపై ఎలాంటి లీక్స్ జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri