Ram Charan: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ స్టార్ రామ్ చరణ్(Ram Charan) లైన్ ఆప్ భారీ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR అనే పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా.. మరోపక్క సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో సినిమా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మరో పక్క కొన్ని కీలకమైన ప్రాజెక్టులను రామ్ చరణ్ లైన్ లో పెడుతున్నారు. విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా లలో ఒకటి రంగస్థలం(Rangasthalam).
సుకుమార్(Sukumar) దర్శకత్వంలో చరణ్ నటించిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డులు సృష్టించింది. చెవిటి వాడి గా రామ్ చరణ్ నటించిన నటనకు విమర్శకుల నుండి ప్రశంశలు లభించాయి. చరణ్ నీ చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ సుకుమార్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మొదటి భాగం ఇటీవల రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. పుష్ప సినిమా యూనిట్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.
ఈ సందర్భంగా సుకుమార్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా లు గురించి.. మాట్లాడుతూ పుష్ప(Pushpa) సెకండ్ పార్ట్ తర్వాత.. విజయ్ దేవరకొండ(Vijaydeverakonda)తో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఆ తరువాత పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఉంటుందని.. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి అని అంతా ఓకే అయితే త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని… స్పష్టం చేశాడు. దీంతో రంగస్థలం కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు ఉండటంతో సుకుమార్ ప్రకటనకు మెగా పవర్ స్టార్ అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా త్వరగా ఓకే అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని.. చరణ్ లైనప్ ఓ రేంజ్ లో ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చరణ్(Charan) శంకర్ (Shankar)దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!