స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `ఇండియన్ 2`. సినిమా మొదలైనప్పుడు ఎంత క్రేజ్ ఉందో, మధ్యలో ఆగిపోయినప్పుడు కూడా వార్తలు దావానలంగా వ్యాపించాయి. `మా సినిమా ఆగిపోలేదోచ్…` అంటూ మధ్య దర్శకనిర్మాతలు అందుకుని మరీ ఊపిరిలూదారు. దానికి బలం చేకూరుస్తూ ఈ మధ్యనే షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఐశ్వర్యా రాజేశ్‌ను కూడా దర్శకుడు శంకర్ ఎంపిక చేశారు. ఇద్దరూ టాప్ ఇండియన్ స్టార్స్ సినిమాలో అవకాశం అనగానే ఐశ్వర్యా రాజేశ్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. అయితే అసలు సమస్య డేట్స్ అడ్జస్ట్మెంట్లోనే వచ్చింది. దీంతో సినిమా నుండి ఐశ్వర్య తప్పుకోక తప్పలేదు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంపై ఐశ్వర్య బాధను వ్యక్తం చేసింది. మరోసారి వారి సినిమాల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!