టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా అమీర్ ఖాన్. సరికొత్త ప్రయోగాలు చేస్తూ కథకి తగ్గ రీతిలో తనను తాను మలచుకోవడంలో కూడా అమీర్ ఖాన్ సిద్ధహస్తుడు అని చెప్పవచ్చు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది అమీర్ ఖాన్ సినిమాలో నటించాలని కోరుకుంటూ ఉంటారు.
అటువంటిది తాజాగా ఆ లక్కీ ఛాన్స్ అక్కినేని హీరో నాగచైతన్యకి వచ్చినట్లు సమాచారం. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ, థాంక్యూ సినిమా చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి అమిర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులోని సపోర్టింగ్ పాత్ర తో చైతూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో లాంచ్ అవుతున్నట్లు సమాచారం.
మొదటిలో ఈ పాత్ర కోసం తమిళ హీరో విజయ్ సేతుపతి ఓకే అయినట్లు కానీ డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి అతడు తప్పుకోవడంతో ఆ ప్లేస్లో నాగచైతన్య నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు దీంతో అమీర్ ఖాన్ సినిమాతో నాగ చైతన్య బీ టౌన్ లో అడుగు పెట్టబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.