ఇంటా బయటా వివాదరహితుడిగా పేరున్న నటుడు. దేశభక్తి, యాక్షన్ ఎంటర్టైనర్ల విషయంలో అక్షయ్ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. కామెడీ బాగా పండిచగల బాలీవుడ్ నటులలో అక్షయ్ ఒకరు. అంతా బాగున్న ఓ విషయంలో మాత్రం అక్షయ్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అదే భారత పౌరసత్వం. కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసేవారు. కెనడా పౌరసత్వాన్ని వదులుకుని దేశభక్తి నిరూపించుకోవాలంటూ ఎద్దేవా చేసేవారు. అయితే ఈ విషయంలో అభిమానులు ఆయన్ను వెనకేసుకు వచ్చేవారు.
ఈ వివాదాలకు చెక్ పెట్టాలనుకునేవాడో ఏమో.. ఇటీవల తాను ఇండియన్ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని అక్కీ బయటపెట్టారు. ఇటీవల జరిగిన లీడర్షిప్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్.. పాస్‌పోర్టు కోసం అప్లై చేసిన విషయాన్ని చెప్పారు. ఇంతకాలం తన దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరం రాలేదని.. కానీ పౌరసత్వం వివాదాస్పదం కావడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు. దేశం కోసం తనదైన మార్గంలో చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంటానని చెప్పుకొచ్చారు
అక్షయ్ కుమార్. పేద ప్రజలను ఆదుకోవడంలో కానీ, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో.. అక్షయ్ కుమార్ ముందుంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!