Alia Bhatt- Ranbir Kapoor: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. గత ఐదేళ్ల నుంచీ ప్రేమించుకున్న ఈ జంట.. అనేక అడ్డంకులను దాటుకుని నేడు మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
ముంబైలోని రణ్‌బీర్ నివాసమైన వాస్తు లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరు అయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అలియా భట్ అభిమానులతో పంచుకుంది.
`ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం నేడు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. ఈ క్షణం మాకెంతో ప్రత్యేకమైనది. జంటగా మరెన్నో జ్ఞాపకాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము` అంటూ అలియా ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
దీంతో అలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. కొంత జంటకు నెటిజన్లు, అభిమానులు మరియు సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. కాగా, పెళ్ళి గురించి కరెక్ట్ డేట్ చెప్పకుండా ఇరు కుటుంబసభ్యులు గత కొద్ది రోజుల నుంచీ అందరినీ కన్ ఫ్యూజన్ లో పడేశారు.
ఈ నేపథ్యంలోనే వీరి పెళ్ళి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యిందంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ వార్తలకు పులిస్టాప్ పడిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం అలియా-రణ్‌బీర్‌ల వెడ్డింగ్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!