మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఎన్ని సినిమాలు చేసినా రాని పాపులారిటీ ఒక్క పుష్ప సినిమాతో వచ్చింది. ఇక ఈ సినిమాకి గాను బన్నీకి నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు. పుష్ప కి ఈ సినిమా డబల్ ఉంటుందని రిలీజ్ అయిన పోస్టర్లు ద్వారా తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఈ డేట్ ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు కూడా.
ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యి వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇక్కడి నుంచి బన్నీ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. అల్లు అర్జున్ బ్లూ కలర్ సారీ ధరించి కుర్చీలో కూర్చున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టీంట చక్కెరలు కొడుతుంది. తిరపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప 2 లో కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట.
ఇక ఆల్రెడీ ఆ సీన్స్ కి తగ్గ షూట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు చేస్తున్న సీన్స్ ని కూడా అందులో యాడ్ చేయనున్నాడట సుకుమార్. ఇక అల్లు అర్జున్ ని చీర కట్టులో చూసిన ఆయన ఫ్యాన్స్..” బన్నీ అన్న చీర కట్టులో అచ్చం అమ్మవారి లాగానే ఉన్నాడు. నిజంగా ఈ ఫోటో చూస్తుంటే గూస్బంస్ వస్తున్నాయి బ్రో. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.