అవును నిజం ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి దారుణంగా తయారయింది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం ఎటువంటి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. ఇక అప్పుడప్పుడు అడపా దడపా అవకాశాలు వస్తుంటే వాటిని కూడా చేజార్చుకుంది పూజ.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. సందీప్ దర్శకత్వంలో రవితేజ నటించబోయే.. మూవీలో పూజ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి. ఇక ఈ ముద్దుగుమ్మ కాల్ షీట్స్ కూడా బుక్ చేసిందట.
ఇక రేపో మాపో అఫీషియల్ గా ప్రకటిస్తారు అనే లోపే ఈమె స్థానాన్ని మరో హీరోయిన్ కొట్టేసిందట. ఆమె మరెవ్వరో కాదు కన్నడ బ్యూటీ రుక్మిణి. సప్త సాగరాలు దాటి అనే సినిమాతో పెద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ ముద్దుగుమ్మ పై స్టార్ డైరెక్టర్ లో కన్ను పడింది.
ఇక దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది రుక్మిణి. ఇక దీంతో పూజ పరిస్థితి ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే అన్నట్లు అయిపోయింది. ఇక ఈ ఐరన్ లెగ్ పాప రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం చాలా అసాధ్యమనే చెప్పొచ్చు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?