Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ అందరికీ సుపరిచితుడే. తెలుగు టెలివిజన్ రంగంలో పేరుగాంచిన పలు షోలలో అందరిని తన యాంకరింగ్ మరియు పంచ్ డైలాగ్ లతో ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. బుల్లితెరపై తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుని.. అడపాదడప సినిమాలు కూడా చేయడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలో.. కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హీరోగా “30 రోజులలో ప్రేమించడం ఎలా..?” అనే సినిమా కూడా చేయడం జరిగింది. హీరోగా మొదటి సినిమాతో మంచి విజయం సాధించాడు. కానీ రెండో సినిమా ఇప్పటివరకూ చేయలేదు.
ఆ తర్వాత మళ్లీ యధావిధిగా బుల్లితెర రంగంలో రాణిస్తున్నారు. ప్రదీప్ కి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇంకా తెలుగు టెలివిజన్ యాంకరింగ్ రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఎన్నోసార్లు యాంకర్ ప్రదీప్ పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ టైంలో ప్రదీప్ వాటన్నిటిని ఖండించడం జరిగింది. కానీ లేటెస్ట్ గా మాత్రం గత కొద్దిరోజుల నుండి ఓ వార్త వైరల్ అవుతూ ఉంది. మేటర్ లోకి వెళ్తే యాంకర్ ప్రదీప్ వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్.. నవ్యతో పెళ్లికి రెడీ అయినట్లు టాక్. ఎప్పటినుండో ఆమెతో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు ఒప్పుకోవటంతో త్వరలో ఈ జంట.. ఒకటి కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు చర్చించుకుంటున్నారట. అంతేకాదు వీరి మతాలు కూడా వేరు అని అంటున్నారు. నవ్య యాంకర్ ప్రదీప్ కి మాత్రమే కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చాలామందికి కాస్ట్యూమ్ చేయడం జరిగింది. తెలుగు బుల్లితెర రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్ గా నవ్యకి మంచి పేరు ఉంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!