అనుష్క నటిస్తోన్న చిత్రం `సైలెన్స్`. ఈ సినిమాలో ఈమె మాటలు రాని, చెవులు వినపడని అమ్మాయి పాత్రలో కనపడనుంది. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయమైతే కాదు. కాబట్టి అనుష్క ఇలాంటి పాత్రను పోషించడానికి చాలానే కష్టపడిందట. అందుకోసం అలాంటి సమస్యతో బాధపడుతున్న పిల్లలను కలుసుకుని వాళ్లను దగ్గరుండి గమనించిందట. అలాగే ఓ ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకుని మరీ నటించదట. ఇందులో అనుష్క పెయింటర్‌గా కనపడనుంది. ఆ పాత్ర కోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుందట.
`భాగమతి` తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది హీరోయిన్ అనుష్క. అందుకు కారణం ఆమె బరువు తగ్గడానికే. బరువు తగ్గిన తర్వాత అనుష్క నటిస్తోన్న తొలి చిత్రం `సైలెన్స్`. హేమంత్ మధుకర్ దర్శకుడు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలు.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!