Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బర్తడే వచ్చినా లేకపోతే మహేష్ సినిమా కి సంబంధించి టీజర్ రిలీజ్ అయిన.. ఫోటో రిలీజ్ అయిన భారీ స్థాయిలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇతర హీరోల పై ఉన్న రికార్డులను టార్గెట్ చేసి మరి దెబ్బ కొడుతుంటారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మహేష్ కెరియర్ లో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సెంటిమెంట్ అని అందరికీ తెలుసు.
ఆ రోజు మహేష్ తాను నటిస్తున్న సినిమాకి సంబంధించి టీజర్ లేదా ఫోటో రిలీజ్ చేసి అభిమానులను ఎంటర్ టైన్ చేస్తారు. గత ఏడాది కృష్ణ పుట్టినరోజు నాడు “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు మే 31 వ తారీకు ఫస్ట్ లుక్ టైటిల్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సారి కూడా మహేష్ ఏదైనా వీడియో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు అభిమానులు. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఎంతగానో ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో దేశంలో పరిస్థితులు బాధాకరంగా ఉండటంతో.. మహేష్ “సర్కారు వారి పాట” సినిమా కి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు.
Read More: Mahesh Trivikram: మహేష్- త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో సరికొత్త పేరు..??
దీంతో అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందారు. పరిస్థితి ఇలా ఉండగా మరో షాకింగ్ న్యూస్ సరికొత్తగా ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే “సర్కారు వారి పాట” సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తారని.. మొదటిలో సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో.. షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో సినిమా సంక్రాంతి పండుగకు రావడం కష్టమే అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. దీంతో అనుకున్న టైం కి కూడా సినిమా రిలీజ్ కానీ పరిస్థితి ఉండటంతో మహేష్ అభిమానులకు ఇది కచ్చితంగా చేదు వార్త అని సినీ మేకర్స్ అంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!